Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

‘భీష్మ’ చిత్రానికీ తప్పని టైటిల్ వివాదం.. బీజేపీ అభ్యంతరం!

గతంలో మెగా వారసుడు వరుణ్ తేజ్ నటించిన 'వాల్మీకి' టైటిల్‌పై రేగిన వివాదాలు ఇప్పుడు నితిన్ హీరోగా వస్తోన్న 'భీష్మ' చిత్ర యూనిట్‌కి..
Controversy on Bheeshma movie Title, ‘భీష్మ’ చిత్రానికీ తప్పని టైటిల్ వివాదం.. బీజేపీ అభ్యంతరం!

గతంలో మెగా వారసుడు వరుణ్ తేజ్ నటించిన ‘వాల్మీకి’ టైటిల్‌పై రేగిన వివాదాలు ఇప్పుడు నితిన్ హీరోగా వస్తోన్న ‘భీష్మ’ చిత్ర యూనిట్‌కి కూడా తప్పడం లేదు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని.. హీరోని లవర్‌బోయ్‌గా చూపిస్తూ, ‘భీష్మ’ అని టైటిల్‌ పెట్టడం బాధాకరమని బీజేపీ ధార్మిక సెల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చిత్ర నిర్మాతలు స్పందించి, టైటిల్ మార్చాలని.. లేకుంటే చిత్రం విడుదలను అడ్డుకుంటామన్నారు. అవసరమైతే టైటిల్ విషయంపై కోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరిస్తున్నారు.

కాగా.. తాజాగా ఈ చిత్రం 17వ తేదీన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది. అయితే ఈ నెల 21న మహా శివరాత్రి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు.

Related Tags