Style of Melania Trump : అమెరికాలో వాళ్ల అధికారం ముగిసింది.. అయినా మరోసారి లైమ్ లైట్‌లోకి..

మెలనియా ట్రంప్... అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్యగా ప్రపంచానికి మొదటగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తన డ్రెస్సింగ్ స్టైల్స్ తో అందర్నీ ఆకట్టుకున్నారు.

Style of Melania Trump : అమెరికాలో వాళ్ల అధికారం ముగిసింది.. అయినా మరోసారి లైమ్ లైట్‌లోకి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 23, 2021 | 7:07 AM

Style of Melania Trump : అమెరికాలో వాళ్ల అధికారం ముగిసింది.. అయితే వారి విలాసవంతమైన జీవితం గురించి, ఖరీదైన వస్తువుల గురించి మాత్రం చర్చ కొనసాగుతోంది. ట్రంప్‌ భార్య మెలానియా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు.

భర్తదేమో అధికార దర్పం… భార్యదేమో ఫ్యాషన్ సోకుల ప్రపంచం. ఇద్దరూ కలిసి వెళ్తుంటే ఆయన ఏం చెబుతాడా అని చూసే వారు కొందరైతే.. ఆమె ఎలాంటి డ్రెస్ వేసుకుంటుందా అని చూసేవారు మరికొందరు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దంపతులే ఆ ఇద్దరు. ఓ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ తో ఆమెను మరోసారి లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది ఆమెరికా మీడియా.

మెలనియా ట్రంప్… అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్యగా ప్రపంచానికి మొదటగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తన డ్రెస్సింగ్ స్టైల్స్ తో అందర్నీ ఆకట్టుకున్నారు. ఫారిన్ టూర్ కి వెళ్లినప్పుడు ఆమె వేసిన దుస్తులు, వేసుకున్న ఫుట్ వేర్ అన్నింటిపైనా అప్పట్లో డిస్కషన్ నడిచేది.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం మెలనియా ట్రంప్ ఓ ఫ్యాషన్ ఐకాన్ గా చెలామణి అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విదేశాలకు వెళ్లినప్పుడు… ట్రంప్ కంటే మెలనియా స్టైల్ పైనే ఎక్కువ ఫోకస్ ఉండేది.ఫారిన్ టూర్స్‌లో కానీ అమెరికాలో కానీ అంతలా అమె దర్జా ఒలకబోయడానికి కోట్ల విలువైన ప్రభుత్వం ధనమే కారణమని ఇప్పుడిప్పుడు బయటకు వస్తోంది. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా డ్రెస్సులకు, ఇతర అలంకరణ వస్తువులపై ఖర్చు చేశారని అమెరికా పత్రికలు కోడై కూస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా ఓటమి తర్వాత ట్రంప్ దంపతులు వైట్ హౌస్ విడిచిపెట్టి వెళ్తిపోతున్నప్పుడు కనిపించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. వెళ్లిపోయే సందర్భంగా మెలనియా ఖరీదైన హ్యాండ్ బ్యాగ్, వేసుకున్న డ్రెస్, పెట్టుకున్న గాగుల్స్ పెట్టుకున్నారు. వైట్ హౌస్ నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఆమె పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ పై చాలా మంది రీసెర్చ్ చేశారు.

వీడ్కోలు సమయంలో మెలనియా పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ 65 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇది హెర్మస్ బిర్కిన్ కంపెనీకి చెందిన హ్యాండ్ బ్యాగ్ ఇదని చెబుతున్నారు. ఈ బ్యాగ్ విషయంలోనే కాదు… చాలా ఖరీదైన డ్రెస్సెస్, షూలు ఆమె యూజ్ చేసేవారని అమెరికన్ పత్రికలు చెబుతున్నాయి. ఆఖరి రోజు ఆమె వేసుకున్న డ్రెస్ డోల్స్ అండ్ గబ్బాన కంపెనీ డిజైన్ చేయగా… ఆమె వేసుకున్న షూ… లౌబౌటిన్ కంపెనీకి చెందింది. ఇవన్నీ కూడా మెలనియాకు ఇష్టమైన బ్రాండ్‌లట.

మెలనియా వార్డ్ రోబ్ మొత్తం హెవీ కాస్ట్ డ్రెస్సెస్ తో నిండిపోయి ఉందని చెబుతోంది అమెరికా మీడియా. అందులో గుస్సీ, కర్ల్ లేజర్ ఫీల్డ్, బార్బరీ, డియోర్ కంపెనీ దుస్తులే ఎక్కువగా కనిపిస్తున్నాయట. సుమారు 10 కోట్లకుపైగానే దుస్తులపై ప్రజాధనాన్ని ఆమె ఖర్చు పెట్టిన అంచనా వేస్తున్నారు. ఇదీ భర్త డొనాల్డ్ ట్రంప్ అమెరికాను పాలించినంత కాలం మెలనియా చూపించిన ఖరీదైన ఫ్యాషన్ దర్పం.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..