‘కాపీ కంటెంటర్’? పాట్నాలో పీకేపై ఛీటింగ్ కేసు

ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పై పాట్నాలో ఛీటింగ్ కేసు నమోదయింది. జేడీ-యూ కు చెందిన శాశ్వత్ గౌతమ్ అనే మాజీ నేత ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేనిదే 'బాత్ బీహార్ కీ'అనే  పేరిట

'కాపీ కంటెంటర్'?  పాట్నాలో పీకేపై ఛీటింగ్ కేసు
Follow us

| Edited By:

Updated on: Feb 27, 2020 | 6:47 PM

ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పై పాట్నాలో ఛీటింగ్ కేసు నమోదయింది. జేడీ-యూ కు చెందిన శాశ్వత్ గౌతమ్ అనే మాజీ నేత ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేనిదే ‘బాత్ బీహార్ కీ’అనే  పేరిట నేను రూపొందించిన ప్రచారంలోని కంటెంట్ ను పీకే తన ప్రయోజనాలకోసం వినియోగించుకున్నారని ఆయన ఆరోపించారు. దీంతో పీకేపై 420, 406 సెక్షన్ల కింద ఎఫ్ ఐ ఆర్ దాఖలైంది. ఒసామా అనే వ్యక్తితో  కలిసి తాను ఈ కంటెంట్ ను డెవలప్ చేశానని, దీన్ని ఒక సందర్భంలో పీకేకి అందజేశానని శాశ్వత్ గౌతమ్ తెలిపారు. పలు పార్టీల రాజకీయ ప్రచారాల ‘బిహైండ్ బ్రెయిన్ ‘ గా ఉన్న పీకే ఇటీవల ‘బాత్ బీహార్ కీ ‘ ప్రచార కార్యక్రమం గురించి మీడియా సమావేశంలో ప్రకటించారు. దేశంలోని 10 ఉత్తమమైన రాష్ట్రాల్లో బీహార్ ను ఒకటిగా చేయాలన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. దీనికోసం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 100 రోజులు తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. (అయితే ఆ మధ్య ఈయనను జెడి-యు అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరించారు. సీఏఏ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే). ఇలా ఉండగా.. అజయ్ అలోక్ అనే జేడీ-యు నేత.. పీకేపై సెటైర్లు వేస్తూ.. కంటెంట్ వంటి ఐడియాలను చాకచక్యంగా దొంగిలించడంలో పీకే.. మ్యుజిషియన్ అను మాలిక్ లా మారినట్టు కనిపిస్తోందన్నారు.