కోర్టు ధిక్కరణ కేసులో మరో కార్టూనిస్ట్, ‘అజెండా’, అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ !

వివాదాస్పద కార్టూనిస్ట్ రచితా తనేజాపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేందుకు అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్ ఆమోదించారు. సుప్రీంకోర్టుపై ఆమె వేసిన కార్టూన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని, న్యాయవ్యవస్థకే అవమానకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

కోర్టు ధిక్కరణ కేసులో మరో కార్టూనిస్ట్, 'అజెండా', అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 02, 2020 | 2:45 PM

వివాదాస్పద కార్టూనిస్ట్ రచితా తనేజాపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేందుకు అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్ ఆమోదించారు. సుప్రీంకోర్టుపై ఆమె వేసిన కార్టూన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని, న్యాయవ్యవస్థకే అవమానకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఓ లా విద్యార్ధి చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని ఆయన రచితా పై కోర్టు ధిక్కరణ కేసు దాఖలుకు ఆమోదముద్ర వేశారు. రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్నివ్యంగ్యంగా ఆమె ప్రస్తావిస్తూ న్యాయస్థానాన్ని ‘శానిటరీ పానెల్స్’ గా చిత్రీకరించి కార్టూన్ వేశారు. అలాగే కోర్టును కించపరిచేలా ఉండే మరికొన్ని క్యారికేచర్లను కూడా గీశారు.

2018 లో అన్వయ్ నాయక్ అనే ఆర్కిటెక్ట్ తో బాటు ఆయన తల్లి కూడా సూసైడ్ చేసుకునేలా ప్రోత్సహించారంటూ అర్నాబ్ గోస్వామిపై పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపడం, తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే.   న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, ఇందిరా బెనర్జీలతో కూడి న బెంచ్ ఆయనకు బెయిల్ ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మందలించింది. దీనిపై మరో కార్టూనిస్ట్ కునాల్ కమ్రా సైతం  సుప్రీంకోర్టును కించపరిచేలా ట్వీట్లు చేశారు.  ఆయనపై కూడా కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ చేపట్టాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ లోగడ ఆదేశించారు. భావ ప్రకటన స్వేఛ్చ పేరిట ఎవరి ఇష్టం వఛ్చినట్టు వారు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అగౌరవ పరుస్తున్నారని ఆయన  మండిపడ్డారు.దీనివల్ల వారు శిక్షార్హులవుతారని అన్నారు.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!