త్వరలోనే అయోధ్య రామమందిర నిర్మాణ పనులు

సుప్రీంకోర్టు ఆదేశించిన శ్రీరామ్‌జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యులు రేపు అయోధ్యలో సమావేశం కానున్నారు. ఆలయ నిర్మాణ పనులను ఎప్పుటి నుంచి ఆరంభించాలో నిర్ణయిస్తారు

త్వరలోనే అయోధ్య రామమందిర నిర్మాణ పనులు
Follow us

|

Updated on: Jul 18, 2020 | 4:57 PM

కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడిన అయోధ్య రామమందిరం శంకుస్థాపన త్వరలో జరగనుంది.. సుప్రీంకోర్టు ఆదేశించిన శ్రీరామ్‌జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యులు రేపు అయోధ్యలో సమావేశం కానున్నారు. ఆలయ నిర్మాణ పనులను ఎప్పుటి నుంచి ఆరంభించాలో నిర్ణయిస్తారు.. రేపు జరగబోయే ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా ఆహ్వానించినట్టు ట్రస్ట్‌ సభ్యులు పేర్కొన్నారు.. మోదీ ఖరారు చేసిన రోజునే గుడి శంకుస్థాపన జరుగుతుందన్నారు. శనివారం జరిగే సమావేశానికి ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ న్రిపేంద్ర మిశ్రా కూడా పాల్గొంటారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా పాల్గొనబోతున్నారు. ఆగస్టులో ఓ శుభ ముహూర్తానా ఆలయ నిర్మాణ పనులు మొదలు కావచ్చని తెలుస్తోంది..

నిజానికి గత నెల 10వ తేదీనే రామమందిరానికి పునాదులు పడాల్సి ఉంది.. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులను ట్రస్ట్‌ సభ్యులు ఆహ్వానించారు. కానీ కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో అందరి క్షేమం కోసం కార్యక్రమాన్ని వాయిదా వేశారు.. అయితే ఇప్పుడు మాత్రం ఆలయ నిర్మాణ ఆరంభాన్ని మాత్రం నిరాడంబరంగా చేయాలని అనుకుంటున్నారు.. కేవలం కొందరికి మాత్రమే ఆహ్వానం పంపనున్నారు.. ప్రస్తుతం ఆహ్వానితుల జాబితాలో నరేంద్రమోదీ, మోహన్ భగవత్‌, యోగీ ఆదిత్యనాథ్‌, ఇంకొంత మంది ప్రముఖులు మాత్రమే ఉన్నారు..