అమరావతికి ఖర్చుపెట్టడం దండగే: సీఎం కేసీఆర్

Constructing New Capital In Amaravati is Waste Of Money : KCR, అమరావతికి ఖర్చుపెట్టడం దండగే: సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడం మంచిది కాదని తాను ఆనాడే చెప్పానని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వ హాయంలో తాను అప్పటి ఏపీ సీఎం చంద్రబాబును రాజధాని నిర్మాణం విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టాలని సూచించానని, అయితే తన మాటలు ఆయన పట్టించుకోలేదని కేసీఆర్ అన్నారు. అమరావతి నిర్మాణం కంటే రాయలసీమకు నీళ్లు తీసుకురావడం, నీటిపారుదల ప్రాజెక్టులకు ఖర్చుపెట్టాలని తాను చేసిన సూచనను పెడచెవిన పెట్టారని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణలో రైతాంగం అభివృద్ది కోసం తాము సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధమ ప్రాధాన్యత ఇచ్చినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *