ఎటు చూసినా రాముడి రూపమే.. రాజ్యాంగంలోనూ రాముడి స్కెచ్..!

అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేయనుండగా.. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. గర్భగుడి వద్ద వెండితో

ఎటు చూసినా రాముడి రూపమే.. రాజ్యాంగంలోనూ రాముడి స్కెచ్..!
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2020 | 12:56 PM

అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. రామ మందిరానికి ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేయనుండగా.. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. గర్భగుడి వద్ద వెండితో పైకప్పును ఏర్పాటు చేయనుండగా, ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా ఇది నిలవనుంది. స్థానికులు ఇంటిముందు రంగవల్లులతో, విద్యుత్ దీపాలతో అలంకరణలు చేశారు. రామ భక్తులు, అఖాడాల సాధువులు రాముడి పాటలతో తన్మయత్వంతో మునిగితేలుతున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని మూడున్నర ఏళ్లలో పూర్తి చేయనున్నారు.

కాగా.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆసక్తికర ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘రాజ్యాంగం ఒరిజినల్ డాక్యుమెంట్ లో అద్భుతమైన స్కెచ్ ఉంది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగొస్తున్న స్కెచ్ ఇది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధ్యాయం ముందుభాగంలో ఈ ఫోటో వస్తుంది. మీతో పంచుకోవాలని అనిపించింది.’ అని మంత్రి ట్వీట్ చేశారు.

[svt-event date=”05/08/2020,12:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!

గుడ్ న్యూస్: 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్