ఒక్క పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లు ఏం చేస్తున్నారంటే…

కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గతపోరు ప్రారంభమయ్యింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం నుంచి కోలుకోకముందే.. అధిష్టానానికి ఇప్పుడు మరో తలనొప్పి వచ్చిపడింది. ఎవరూ ఊహించని విధంగా సీనియర్లంతా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఇంటికే పరిమితమైన నేతలందరికీ ఓ పదవి ఊరిస్తోంది. అదే ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎమ్మెల్సీ పదవి. మార్చి నాటికి కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీలుగా ఉన్న షబ్బీర్ అలీ, పొంగులేటి […]

ఒక్క పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లు ఏం చేస్తున్నారంటే...
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 9:33 PM

కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గతపోరు ప్రారంభమయ్యింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం నుంచి కోలుకోకముందే.. అధిష్టానానికి ఇప్పుడు మరో తలనొప్పి వచ్చిపడింది. ఎవరూ ఊహించని విధంగా సీనియర్లంతా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఇంటికే పరిమితమైన నేతలందరికీ ఓ పదవి ఊరిస్తోంది. అదే ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎమ్మెల్సీ పదవి. మార్చి నాటికి కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీలుగా ఉన్న షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిల పదవీకాలం త్వరలో ముగిసిపోతోంది. కాగా ఆకుల లలిత టీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు. అయితే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన రాములు నాయక్, యాదవరెడ్డిలపై అనర్హత వేటుపడగా.. కొండ మురళీ రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోటాలో ఒకే ఒక్కరు కౌన్సిల్ కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. దీంతో ఓ వైపు సీనియర్లు.. మరోవైపు జూనియర్లు ఈ ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడుతున్నారు.

ఒక ఎమ్మెల్సీ పదవికి 17మంది ఎమ్మెల్యేల బలం కావాలి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో 19మంది ఎమ్మెల్సీల బలం ఉంది. దీంతో ఏలాగైన కాంగ్రెస్ కోటాలో ఓ ఎమ్మెల్సీ పదవి దక్కనుంది. అయితే ఈ ఒక్క పదవికి ఇప్పుు సీనియర్లు, జూనియర్లు అందరూ పోటీపడుతున్నారు. ఎలాగైన ఆ పదవి దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు. అధిష్టానం మెప్పుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జానారెడ్డి, షబ్బీర్ అలీ, డీకే అరుణ, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ్మ, పొన్నాల లక్ష్యయ్య, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి సీనియర్ నేతలంతా ఈ పదవికోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక మర్రి శశిధర్ రెడ్డి, నేరేళ్ల శారద అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం సూచన మేరకు పార్టీకి పనిచేసి టికెట్ డిమాండ్ చెయ్యలేదు. అయితే ఈ ఇద్దరు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

అయితే అధిష్టానం చాకచక్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఉన్న సీనియర్లందరినీ కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ బుజ్జగించే పనిలో పడింది. అందుకోసం కసరత్తులు కూడా ప్రారంభించింది. షబ్బీర్ అలీని నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తోంది. పొన్నం, జీవన్ రెడ్డిలలో ఎవరో ఒకరిని కరీంనగర్ ఎంపీగా లేదా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఉన్న ఒక్క సీటు ఎవరికి వారు ప్రయత్నాలు ప్రారంభించడంతో పదవి ఎవరిని వరించనుందో అన్న టెన్షన్ ఆశావాహుల్లో మొదలైంది. ఇదిలా ఉంటే మార్చి నాటికి జరిగే ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో కనీసం 17మంది ఎమ్మెల్యేలు మిగులుతారా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.