కాషాయం ధరించి అత్యాచారాలు చేస్తున్నారు: దిగ్విజయ్ ఆరోపణలు

congress senior leader Digvijay singh, కాషాయం ధరించి అత్యాచారాలు  చేస్తున్నారు:  దిగ్విజయ్ ఆరోపణలు

కాషాయం ధరించినవారు అత్యాచారాలకు పాల్పడుతున్నారని దుమారం రేపారు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. భోపాల్‌లో మంగళవారం జరిగిన సంత్ సమాగమమ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిగ్గీ రాజా మాట్లాడుతూ కాషాయం ధరించే పురుషులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని సాధువులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సనాతనధర్మం అత్యంత ప్రాచీనమైంది. దాన్ని పరిరక్షించడానికి బదులు కొందమంది కాషాయం వేసుకుని, చూర్ణాలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మరికొంతమంది అదే కాషాయాన్ని అడ్డుపెట్టుకుని మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారని, దేవాలయాల్లో సైతం ఇదే జరుగుతుందని దిగ్విజయ్ విమర్శించారు. సనాతన మతానికి అపఖ్యాతి తెచ్చే పనులు చేస్తుంటే భగవంతుడు సైతం క్షమించడని దిగ్విజయ్ అన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *