కరోనాను జయించిన కాంగ్రెస్ సీనియర్ నేత దంపతులు

పది రోజుల క్రితం కరోనా వైరస్ తో అపోలో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు ఈ రోజు కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు.

కరోనాను జయించిన కాంగ్రెస్ సీనియర్ నేత దంపతులు
Follow us

|

Updated on: Jul 01, 2020 | 8:04 PM

కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు దంపతులు కరోనాను జయించారు. పది రోజుల క్రితం కరోనా వైరస్ తో అపోలో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు ఈ రోజు కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. జూన్ 21న పాజిటివ్ రావడంతో వారు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. 10 రోజుల తర్వాత బుధవారం(జూలై1న) వారు డిశ్చార్జ్ అయ్యారు. 60 ఏళ్ళు దాటిన  వీహెచ్ దంపతులు వైరస్ నుంచి కోలుకొని బయటపడటంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్ధతుగా గాంధీ ఆస్పత్రికి వెళ్లినప్పుడు వీహెచ్‌కు కరోనా అంటి ఉంటుందని తెలుస్తోంది. కాగా, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు పద్మారావు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేశ్ గుప్తా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. కాగా వీరంతా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు దేశంలో అన్‌లాక్ 2.0 మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు, పాలకులు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. మరికొన్ని రోజులు పాటు భౌతిక దూరం పాటిస్తూ సభలు సమావేశాలు, జనం సమూహాలకు దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. రాబోయే జులై, ఆగష్టు మాసాలలో కరోనా వైరస్ మరింత విజృంభించే అవకాశముందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్( డబ్ల్యూ హెచ్‌వో) ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!