Breaking News
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. సాయం చేయడానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటాం-ప్రధాని మోదీ.
  • ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు. కరోనాపై యుద్ధంలో భారతీయుల కృషి అభినందనీయం. భారత ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు-ట్రంప్‌ ట్వీట్‌.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తికి సోదరుడు కావడంతో.. స్థానికుల్లో పలు అనుమానాలు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు. శాంపిల్స్‌ పరీక్షించే వరకు మృతదేహం ఇవ్వమంటున్న అధికారులు.
  • తెలంగాణలో డయల్‌ 100కు పెరుగుతున్న కాల్స్‌. లాక్‌డౌన్‌ తర్వాత డయల్‌ 100కు 13,34,330 కాల్స్‌. ఎమర్జెన్సీ కాల్స్‌-82,014. కోవిడ్‌ సస్పెక్ట్ కాల్స్‌- 2,710. లాక్‌డౌన్‌ కాల్స్‌-21,758. ఇన్‌ ఎఫెక్టివ్‌ కాల్స్‌-87,665. విచారణ కోసం చేసిన కాల్స్‌- 84,123. తగ్గిన చోరీలు, గృహ హింస, రోడ్డుప్రమాదాల కాల్స్‌.
  • తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రైమ్‌రేట్‌ భారీగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రైమ్‌రేటు 56 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌తో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై వేటుకు సిద్ధం..!

Komatireddy Rajagopal Reddy, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై వేటుకు సిద్ధం..!

కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కంచి, బీజేపీకి చేరువైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపిన పార్టీ క్రమశిక్షణా సంఘం అధిస్టానానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరుపై కూడా పూర్తి వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడిన రాజగోపాల్ రెడ్డి తీరుతెన్నులపై విచారణ జరిపిన కోదండరెడ్డి సారథ్యంలోని టీపీసీసీ క్రమ శిక్షణా సంఘం.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పీసీసీ సారథి ఉత్తం కుమారెడ్డిలకు నివేదిక సమర్పించింది.

గత మూడేళ్ళలో రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులు, ఇటీవల ఎమ్మెల్సీగా పోటీచేసి ఓటమిపాలైన గూడూరు నారాయణ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి దాడి, ప్రచార కమిటీ చైర్మన్‌గా వున్న భట్టి విక్రమార్కపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియాపై చేసిన కామెంట్స్‌తో పాటు.. బీజేపీనే టీఆర్ఎస్ పార్టీ ప్రత్నామ్నాయమంటూ చేసిన వ్యాఖ్యలను క్రోడీకరించి నివేదిక సమర్పించినట్లు సమాచారం.

Related Tags