‘మత విద్వేష వైరస్ ని వ్యాపింపజేస్తున్న బీజేపీ’.. సోనియా ఫైర్

కరోనా సంక్షోభం మొదలయ్యాక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మొదటిసారిగా బీజేపీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ మతపరమైన విద్వేషంతో కూడిన వైరస్ ని వ్యాపింపజేస్తోందని, ఇది ప్రతి భారతీయుడిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు.

'మత విద్వేష వైరస్ ని వ్యాపింపజేస్తున్న బీజేపీ'.. సోనియా ఫైర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 23, 2020 | 1:06 PM

కరోనా సంక్షోభం మొదలయ్యాక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మొదటిసారిగా బీజేపీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ మతపరమైన విద్వేషంతో కూడిన వైరస్ ని వ్యాపింపజేస్తోందని, ఇది ప్రతి భారతీయుడిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు తమ పార్టీ ఇఛ్చిన సూచనలను ప్రభుత్వం పాక్షికంగా పాటిస్తోందని ఆమె ఆరోపించారు. లాక్ డౌన్ ప్రభావాన్ని తగ్గించడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. కరోనాపై పోరాటానికి చేతులు కలపడానికి తాము ముందుకు వఛ్చినా కమలం పార్టీ స్పందించడం లేదన్నారు. మన సామాజిక సామరస్యం  డామేజ్ అవుతోందని, దీన్ని మనం కలిసి సరిదిద్దుదామని ఆమె చెప్పారు. లాక్ డౌన్ పొడిగింపు వల్ల లక్షలాది శ్రమజీవులు, వలస కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. వాణిజ్యం, పరిశ్రమలు చతికిలబడ్డాయని, మే 3 తరువాత పరిస్థితిని ఎలా మేనేజ్ చేయాలో ప్రభుత్వానికి తెలియడంలేదని సోనియా విమర్శించారు.