సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆమె చేరినట్లు ఆసుపత్రి విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ
Follow us

|

Updated on: Jul 30, 2020 | 10:20 PM

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆమె చేరినట్లు ఆసుపత్రి విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. సోనియా గాంధీ గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆమె అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. రెస్పిరేటరీ మెడిసిన్ నిపుణుడైన డాక్టర్ అరూప్ కుమార్ బసు పర్యవేక్షణలో ఆమెకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నెలలో సోనియా గాంధీ కడుపు నొప్పితో బాధపడుతూ ఇదే ఆసుపత్రిలో చేరారు.

ఇదిలావుంటే, ఇవాళ సోనియా గాంధీ పార్టీ రాజ్యసభ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో వారితో చర్చించారు. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు అగ్ర నాయకులు పాల్గొన్నారు.