జనసేన‌వైపు.. కాంగ్రెస్ చూపు, తరిమికొట్టాలన్న సేనాని తలూపుతారా?

హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారుతోంది. అనూహ్యంగా సీపీఐ..అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. మరివైపు ఉత్తమ్ సతీమణి పద్మావతి సభ్యత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి..ఇప్పుడు మనసుమార్చుకోని అక్కడ ప్రచారం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సీటు ప్రతిష్ఠాత్మకంగా మారండంతో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడలు సిద్దం చేస్తుంది. యూత్‌‌లో మంచి పట్టున్న జనసేన మద్దతును   కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ జనసేన కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి […]

జనసేన‌వైపు.. కాంగ్రెస్ చూపు, తరిమికొట్టాలన్న సేనాని తలూపుతారా?
Follow us

|

Updated on: Oct 04, 2019 | 4:53 PM

హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారుతోంది. అనూహ్యంగా సీపీఐ..అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. మరివైపు ఉత్తమ్ సతీమణి పద్మావతి సభ్యత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి..ఇప్పుడు మనసుమార్చుకోని అక్కడ ప్రచారం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సీటు ప్రతిష్ఠాత్మకంగా మారండంతో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడలు సిద్దం చేస్తుంది. యూత్‌‌లో మంచి పట్టున్న జనసేన మద్దతును   కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ జనసేన కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డికి మద్దతునివ్వాల్సిందిగా కోరారు.వెన్ను నొప్పి కారణంగా ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న పవన్ .. కాంగ్రెస్ విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ జనసేన కాంగ్రెస్‌కు మద్దతునిస్తే హుజూర్‌నగర్ వార్‌లో పరిణామాలు మారే అవకాశం ఉంది. అదే సమయంలో ఏపీ ఎన్నికల్లో ప్రభావితం చూపలేకపోయిన జనసేన.. తెలంగాణ ఉపఎన్నికలో ఏం ప్రభావం చూపుతుందని కొంతమంది రాజకీయవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో.?ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యమని పార్టీలు  భావిస్తున్న నేపథ్యంలో జనసేనతో పొత్తు తమకు ఎంతో కొంత కలిసొచ్చిన చాలనే అభిప్రాయంతో కాంగ్రెస్ ఉంది. మరి హస్థం పార్టీ ప్రతిపాదనపై పవన్ ఎలా స్పందిస్తారు..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో ‘కాంగ్రెస్ హఠావో..దేశ్ బచావో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. అంతేకాదు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నేతలపై విరచుకుపడ్డారు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలా మారతారో అస్సలు ఊహించలేం. లెట్స్ వెయిట్ అండ్ సీ.