కేరళలో దారుణం.. కరోనా రోగిని కట్టేసి చికిత్స అందించిన సిబ్బంది

కేరళలో దారుణం జరిగింది. కరోనా సోకిన వృద్ధురాలి చేతిని కట్టేశాడు ఓ శాడిస్టు వైద్యుడు. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారడంతో చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసారు ప్రతిపక్ష పార్టీ నేతలు

  • Balaraju Goud
  • Publish Date - 5:32 pm, Sat, 24 October 20

కేరళలో దారుణం జరిగింది. కరోనా సోకిన వృద్ధురాలి చేతిని కట్టేశాడు ఓ శాడిస్టు వైద్యుడు. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారడంతో చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసారు ప్రతిపక్ష పార్టీ నేతలు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన ఒక కుటుంబంలోని ఆరుగురికి ఇటీవల కరోనా సోకింది. దీంతో కుటుంబ సభ్యులను కేరళలోని పలు ఆస్పత్రులకు తరలించి కరోనా చికిత్స అందించారు.

అయితే, ఆ కుటుంబంలోని 67 ఏండ్ల వృద్ధురాలికి కరోనా వల్ల మానసిక వైకల్యం సంభవించింది. దీంతో ఆమెను కరోనా కేంద్రం నుంచి ఈ నెల 20న త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ వృద్ధురాలిని చూసేందుకు వెళ్లిన బంధువులు ఆమె పరిస్థితి చూసి షాక్‌ అయ్యారు. వృద్ధురాలిని మంచానికి తాళ్ల బంధించారు. అంతేకాదు నేలపై పడటంతో తలకు గాయాలయ్యాయి. తోటి రోగులు దీనిని వీడియో తీశారు. కాగా ఆస్పత్రి సిబ్బంది 1తీరుపై వృద్ధురాలి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

కాగా, దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాపన్‌… కేరళ ఆరోగ్య మంత్రి శైలజాకు లేఖ రాశారు. త్రిస్సూర్‌ మెడికల్‌ కాలేజీలో మానసిక వైద్యులు లేనప్పటికీ ఆమెను అక్కడికి ఎందుకు తరలించి చికిత్స అందిస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు మెడికల్‌ కాలేజీ దవాఖాన అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. సెలైన్‌ ఎక్కించే కాన్యులాను ఆమె తొలగిస్తుండటంతో చేతిని కట్టినట్లు తెలిపారు. మంచం పైనుంచి ఆమె కిందపడటం దురదృష్టకరమని చెప్పారు. తలకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయంటూ ఆరోగ్య మంత్రికి వివరణ ఇచ్చారు.