ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ చేపట్టినవే: ఎంపీ కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. తమ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులతో టీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం లక్ష్మీ దేవిపురంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభకు ఆయన హాజరయ్యారు.  కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు ఇచ్చే విధంగా ప్రణాళిక చేసిందని, దీనికోసం ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు కోమటిరెడ్డి చెప్పారు. తెలంగాణకు దిక్కులేదు గానీ రాయలసీమను రతనాల సీమగా చేస్తానంటూ […]

ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ చేపట్టినవే: ఎంపీ కోమటిరెడ్డి
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 4:08 PM

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. తమ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులతో టీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం లక్ష్మీ దేవిపురంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభకు ఆయన హాజరయ్యారు.  కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు ఇచ్చే విధంగా ప్రణాళిక చేసిందని, దీనికోసం ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు కోమటిరెడ్డి చెప్పారు. తెలంగాణకు దిక్కులేదు గానీ రాయలసీమను రతనాల సీమగా చేస్తానంటూ సీఎం కేసీఆర్ ఢాంబికాలు పలుకుతున్నారని విమర్శించారు కోమటిరెడ్డి.

తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమే చేపట్టారని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలోనే కాళేశ్వరంలోని భారీ మోటార్లకు ఆర్డర్లు ఇచ్చినట్టు తెలిపారు ఎంపీ కోమటిరెడ్డి. కమీషన్ల కోసం మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారని ఆయన ప్రభుత్వంపై విమర్శించారు.