ఆమరణ దీక్షకు భట్టి విక్రమార్క నిర్ణయం

Congress MLA Mallu Bhatti Vikramarka decides to go for fast undo death on CLP merge into TRSLP, ఆమరణ దీక్షకు భట్టి విక్రమార్క నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనాన్ని వ్యతిరేకిస్తూ 36 గంటల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష మొదలుపెట్టిన భట్టి విక్రమార్క… దాన్ని ఆమరణ దీక్షగా మార్చుకున్నారు. మల్లు భట్టి విక్రమార్క దీక్ష చేయగా… కాంగ్రెస్ ముఖ్యనేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, సీతక్క, బలమూరి వెంకట్ తదితరులు ఆయనతో కలిసి దీక్షలో కూర్చున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్ నేతల దీక్షకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ దీనిపై న్యాయం పోరాటం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలోనూ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క దీక్షకు దిగారు.

Congress MLA Mallu Bhatti Vikramarka decides to go for fast undo death on CLP merge into TRSLP, ఆమరణ దీక్షకు భట్టి విక్రమార్క నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *