Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 16 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 216919. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 106737. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 104106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6075. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • జిహెచ్‌ఎంసి స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుదల చేసిన కమిషనర్ లోకేష్ కుమార్ . కొత్త స్టాండింగ్ క‌మిటీ ఎంపిక‌కు రేపు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ . ఈ నెల 10 నుండి 18 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ .
  • ఇంటర్ బోర్డ్ , ఎగ్జామినర్ ల మధ్య బస్ ఛార్జ్ ల లొల్లి. పేపర్ వాల్యుయేషన్ కి వచ్చే వారి కోసం ఆర్టీసీ బస్ లు ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డ్ . ఎగ్జామినర్ ల నుండి ఆ టైం లో ఛార్జ్ లు వసూలు చేయని ఆర్టీసీ. ఇంటర్ బోర్డ్ ఆర్టీసీ కి రాసిన లేఖతో టికెట్ ఛార్జ్ లు తీసుకొని ఆర్టీసీ . ఇప్పుడు ఛార్జ్ లు కట్టాలని అంటున్న ఇంటర్ బోర్డ్ .
  • పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు నివేదికలో విద్యా శాఖ. పదో తరగతి పరీక్ష కేంద్రాలను 2530 నుంచి 4535కి పెంచాం. పదో తరగతి విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. పరీక్ష కేంద్రాల వివరాలను విద్యార్థులకు సమాచారం ఇచ్చాం. థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, మాస్కులు, గ్లవుజులు సేకరించి కేంద్రాలకు పంపించాం. కేంద్రానికి ఒకరు చొప్పున 4,535 మంది వైద్య సిబ్బంది. డీఈఓ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు.
  • తెలుగు ఐఏఎస్ అధికారికి కీలక బాధ్యతలు అమెరికాలోని భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా రవి కోట నియామకం ప్రధాని అధ్యక్షతన కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం వాషిగ్టంట్ (డీసీ)లోని రాయబార కార్యాలయంలో విధులు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్న రవి కోట.
  • తిరుమల: శ్రీవారి దర్శనాలపై టీటీడీ ఈఓ కామెంట్స్. 8వ తేది నుండి భక్తులకు దర్శనాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రేపు మరోసారి సమావేశం నిర్వహించి దర్శన విధానాలను ప్రకటిస్తాం. భక్తుల సంఖ్య, గదుల కేటాయింపు, రవాణా, ప్రసాదాల విక్రయం, టైంస్లాట్ టికెట్ల విధానం, థర్మల్ స్క్రీనింగ్, అన్న ప్రసాద భవనం ప్రారంభం వంటి అంశాలపై అంచనాకు వచ్చాం. దర్శన విధి విధానాలను నిర్ణయించి 8వ తేది నుండి దర్శనాలు ప్రారంభిస్తాం. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.
  • తాడేపల్లి : తాడేపల్లి లో గల ఉండవల్లి సెంటర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి అతి చేరువలో గల ఎన్టీఆర్ కట్ట మరియు క్రిస్టియన్ పేట లో ఈరోజు 4 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన అధికారులు. కాగా ఇందులో ఇద్దరు వాలంటీర్లు ఉండటంతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాలంటీర్లు ఇద్దరు గత మూడు రోజుల క్రితం తాడేపల్లి లో గల ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. అధికారులు తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల శానిటేషన్ పనులను చేస్తున్నారు.

నిన్న మీటింగ్.. నేడు ఫైటింగ్..!

TRS VS Congress In Telangana Assembly, నిన్న మీటింగ్.. నేడు ఫైటింగ్..!

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ పేరు అంటే తెలియని వారుండరు. అసలు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కాంగ్రెస్‌లో తిరుగే లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అన్నా తమ్ముళ్లు ఇద్దరూ కలిసి ప్రచారంలో జోష్ పెంచారు. ఒకరు పార్లమెంట్ మెంబర్‌గా గెలిస్తే.. మరొకరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా, తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి రావడం.. పీసీసీ పదవి తన అన్నకు ఇవ్వకపోవడంతో రాష్ట్ర నాయకత్వానికి ఎదురుతిరిగాడు. బీజేపీలో చేరుతానని ట్విస్ట్ ఇచ్చాడు. తరువాత మళ్లీ యూటర్న్ తీసుకుని కాంగ్రెస్‌లోనే ఉంటానని తెలిపాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి కోమటిరెడ్డి వ్యవహరిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులకే అర్థం కావడం లేదు. మొన్నటి దాకా బీజేపీ వైపు చూసిన కోమటి రెడ్డి తాజాగా మంత్రి హరీష్‌తో భేటీ అయి మరో కొత్త చర్చకు తెరతీశాడు.

అయితే మొన్నటిదాకా టీఆర్ఎస్‌ పేరు చెబితే అగ్గిమీద గుగ్గీలంలా మండిపడిన రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావును కలవడం రాజకీయ పరిశీలకులకే తలనొప్పి తెచ్చిపెట్టింది. అన్నేమో కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ.. తమ్ముడు మాత్రం అన్ని పార్టీలు తిరుగుతూ రాజకీయాల్లో ట్విస్టులు ఇస్తున్నాడు. ఇంతకీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారా..? లేక టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారా..? లేదంటే మళ్లీ సొంతగూటిలోనే కొనసాగుతారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న హరీష్‌కు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను అడిగేందుకే కోమటిరెడ్డి ఆయనను కలిశారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డికి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులపై పెద్ద దుమారమే రేగింది. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో.. కాళేశ్వరం ప్రాజెక్టను చూడటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారని చెప్పడాన్ని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. అదేమైనా టూరిజం స్పాటా అని వ్యంగ్యంగా మాట్లాడారు. వేలకోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ మీరు చేసింది ఇదేనా అంటూ మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించి హరీష్ రావు ఘాటుగా సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు చూడటానికి ప్రజలు వెళుతుంటే కాంగ్రెస్ నేతలు అది చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
అసలు ప్రజా సమస్యలు, సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నలు వేసిన కాంగ్రెస్ సభ్యులకు ప్రభుత్వం ఇచ్చే సమాధానాలు వినే ఓపిక కూడా లేదన్నారు హరీష్ రావు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను ఏళ్ల తరబడి నిర్మించాయి. ప్రాజెక్టులు అంటే ఏళ్ల తరబడి కాదు నెలల్లోనే పూర్తి చేయొచ్చని కేసీఆర్ నిరూపించారని హరీష్ గుర్తుచేశారు.

Related Tags