Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్..తీవ్ర ఉద్రిక్తత

komatireddy rajagopal reddy cpm activists clash in choutuppal, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్..తీవ్ర ఉద్రిక్తత

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ అంశం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్టు వరకు వెళ్లింది. ముందుగా ఇక్కడ సీపీఎం పార్టీ,  కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోని మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఫలితాల అనంతరం ఊహించని విధంగా టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలిపింది. దీంతో రాజకీయ సమీకరణాలు ఒక్కాసారిగా మారిపోయాయు. సీపీఎం సభ్యులతో కోమరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. కాంగ్రెస్‌, సీపీఎం సభ్యులు బాహాబాహికి దిగారు. దాడులు జరుగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి..పరిస్థితి అదుపులోకి తెస్తున్నారు.

చౌటప్పల్ మునిపిపాలిటీలో హంగ్ వాతావరణం నెలకుంది. చైర్మన్ ఎంపిక విషయంలో అన్ని రాజకీయ పక్షాలు గేమ్ ప్లాన్‌ను అమలు చేశాయి. చౌటప్పల్ పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా.. టీఆర్‌ఎస్‌ 8 స్థానాలు, కాంగ్రెస్‌ 5 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, సీపీఎం 3 స్థానాల్లో విజయం సాధించగా..ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఇక్కడ ఎమ్మల్యే రాజగోపాల్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ బలం 6 స్థానాలకు చేరుకుంది. అయితే అప్పటివరకు తమతో ఉన్న సీపీఎం ప్లేటు ఫిరాయించడంతో..కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకుంది. ఎమ్మల్యే కోమటిరెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. సీపీఎం కార్యకర్తలకు మద్దతుగా, టీఆర్‌ఎస్ కార్యకర్తలు రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో కోమటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

 

Related Tags