హరీష్‌రావుపై ఫైర్ అయిన జగ్గారెడ్డి

మాజీ మంత్రి హరీష్‌రావుకు సవాల్ విసిరారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ‘‘జగ్గారెడ్డి కేసులకు భయపడుతున్నాడని..ఆయన ఏటీఎంలు ఏమైపోయాయని’’ హరీష్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కేసులకు భయపడనని,  అలా భయపడితే గత నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వంపై పోరాటం చేసేవాడిని కాదని అన్నారు. ఇక ఆపదలో ఉన్న వారికి కచ్చితంగా తాను ఏటీఎంనే […]

హరీష్‌రావుపై ఫైర్ అయిన జగ్గారెడ్డి
Follow us

|

Updated on: Apr 02, 2019 | 3:55 PM

మాజీ మంత్రి హరీష్‌రావుకు సవాల్ విసిరారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ‘‘జగ్గారెడ్డి కేసులకు భయపడుతున్నాడని..ఆయన ఏటీఎంలు ఏమైపోయాయని’’ హరీష్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కేసులకు భయపడనని,  అలా భయపడితే గత నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వంపై పోరాటం చేసేవాడిని కాదని అన్నారు. ఇక ఆపదలో ఉన్న వారికి కచ్చితంగా తాను ఏటీఎంనే అని తెలిపిన జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజలకు ఆ విషయం తెలుసని అన్నారు. ‘‘నేను ఎంతమందికి ఆర్థిక సహాయం చేశానో.. నువ్వెంతమందికి చేశావో చర్చకు సిద్ధమా?’’ అంటూ ఈ సందర్భంగా హరీష్‌కు సవాల్ విసిరారు జగ్గారెడ్డి.

ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ దక్కాలని పిలుపునిచ్చారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులేదని.. కార్యకర్తలు, నాయకులు ఎవరికి వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!