పొత్తులు కలవకున్నా.. ‘ కత్తులు ‘ కలిశాయి

మహారాష్ట్రలో సిధ్ధాంత పరంగా వైరుధ్యాలు గల శివసేన-కాంగ్రెస్ పార్టీల మధ్య ‘ స్నేహానికి ‘ బీజం పడుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సేనకు మద్దతునివ్వాలనే యోచన దిశగా కాంగ్రెస్ పంథా సాగుతోంది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పూర్తి అధికారమిచ్చింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కలిసి.. సేనకు ఎలా, ఎప్పుడు మద్దతునివ్వాలా అన్న విషయమై కాంగ్రెస్ పెద్దలు చర్చించుకుంటున్నారు. ‘ బంతి […]

పొత్తులు కలవకున్నా.. ' కత్తులు ' కలిశాయి
Follow us

|

Updated on: Nov 12, 2019 | 12:11 PM

మహారాష్ట్రలో సిధ్ధాంత పరంగా వైరుధ్యాలు గల శివసేన-కాంగ్రెస్ పార్టీల మధ్య ‘ స్నేహానికి ‘ బీజం పడుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సేనకు మద్దతునివ్వాలనే యోచన దిశగా కాంగ్రెస్ పంథా సాగుతోంది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పూర్తి అధికారమిచ్చింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కలిసి.. సేనకు ఎలా, ఎప్పుడు మద్దతునివ్వాలా అన్న విషయమై కాంగ్రెస్ పెద్దలు చర్చించుకుంటున్నారు. ‘ బంతి ‘ కాంగ్రెస్ చేతిలోనే ఉందని, ఆ పార్టీతో చర్చలు జరిపాకే ఒక నిర్ణయం తీసుకుంటామని పవార్… తమ పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం స్పష్టం చేశారు. మొదట తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పిన ఆయన.. తాజా పరిణామాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. సేనకు మద్దతు పలికేందుకు సోనియా వ్యక్తిగతంగా విముఖంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గం ఆమెకు కనబడడం లేదు.

సేనకు సపోర్టు చేస్తే తమ పార్టీ సిధ్ధాంతపరంగా పక్కకు వైదొలగినట్టే అవుతుందని ఆమె భావిస్తున్నారు. అటు-మహారాష్ట్రలోని కాంగ్రెస్ నాయకులతో తాము చర్చలు జరుపుతామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖార్గే తెలిపారు. .ఇందుకోసం సోనియా ఈ సాయంత్రం 4 గంటలకు మరో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక.. సేనకు బయట్నుంచి సపోర్ట్ ఇవ్వాలా అన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ బేరీజు వేస్తోంది. ఆ పార్టీకి మద్దతునివ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిన పక్షంలో అది.. హిందుత్వ పాలిటిక్స్ లో ఒక అడుగు పెట్టినట్టేనని భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ పార్టీ కనీస ఉమ్మడి కార్యక్రమంపై పట్టు బట్టవచ్ఛు. కాగా-తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కాదని, సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని తాము కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. అటు-కాంగ్రెస్ మద్దతును శివసేన కోరుతున్నదంటే.. ఈ పార్టీకూడా తన ఐడెంటిటీని కోల్పోయినట్టే.. ! ఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేనకు గవర్నర్ ఈ రాత్రి ఏడున్నర గంటల వరకు గడువునిచ్చారు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కవచ్చునని తెలుస్తోంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.