నడిపే నాయకుడు కరువు… కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక ఏప్రిల్‌లో… తిరిగి రాహులా..? లేక ప్రియాంకానా..?

దేశ స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపిన పార్టీకి నేడు అధినాయకుడు కరువయ్యారు. పన్నెండు దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీకి ఎన్నికల్లో వరుస పరాభవం ఎదురవడంతో పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది.

నడిపే నాయకుడు కరువు... కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక ఏప్రిల్‌లో... తిరిగి రాహులా..? లేక ప్రియాంకానా..?
Follow us

| Edited By:

Updated on: Dec 16, 2020 | 9:23 AM

దేశ స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపిన పార్టీకి నేడు అధినాయకుడు కరువయ్యారు. పన్నెండు దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీకి ఎన్నికల్లో వరుస పరాభవం ఎదురవడంతో పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఏళ్లుగా పార్టీని ఏలుబడి చేస్తున్న గాంధీ – నెహ్రుల వారసత్వానికి బ్రేక్ పడినట్లైంది. రెండు పర్యాయాలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ… కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో మళ్లీ సోనియానే పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. అయితే ఆరోగ్యం, వయసు రీత్యా సోనియా ఎక్కువ కాలం పార్టీని నడపకపోవచ్చు….

ఎన్నిక ఎప్పుడంటే…

సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది. కాగా ఇటీవలే ఏఐసీసీ నూతన కమిటీని సైతం ఎన్నుకున్నారు. అయితే ఏఐసీసీ సభ్యుల్లో మెజార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగించాలని కోరుతున్నారు. సోనియా మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్ష పార్టీ ఎన్నిక మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే పార్టీలోని కొందరు సీనియర్లు రాహుల్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. రాహుల్ దూకుడుగా వ్యవహరించడం లేదని, మోడీతో రాజకీయ పోటీకి సరిపోవడం లేదని, వాగ్ధాటి, రాజకీయ విమర్శల్లో తేలిపోతున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది సీనియర్లు సోనియాను కొనసాగాలని కోరుతున్నారు. కానీ, సోనియాకు కొడుకు రాహుల్‌నే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ఉంది. అయితే ఏఐసీసీ మీటింగ్ ఏప్రిల్ నెలలో జరగనున్నట్లు సమాచారం….

రాహులా..? ప్రియాంకానా…?

2014, 2019 రెండు పార్టమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమిని మూటగట్టుకుంది. యూపీఏ 2 ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ పనితీరుపై దేశ ప్రజలు వ్యతిరేక తీర్పునిచ్చారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. అయితే కాంగ్రెస్ ఎన్నికల సారథ్యం వహించిన రాహుల్ నాయకత్వంపై అనుమానాలు ఏర్పడ్డాయి. రాహుల్ రాజకీయంగా అవలంభిస్తున్న తీరు, అధికార పక్షంపై పోరును సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారని పార్టీలోని సీనియర్లే వాపోతున్నారు. రాహుల్ సైతం పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ పగ్గాల నుంచి తప్పుకున్నాడు. అయితే 2021 -22 లో రానున్న అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపాలంటే కచ్చితంగా నూతన నాయకత్వం అవసరం. మరీ రాహుల్ తిరిగి పార్టీ పగ్గాలు చేపడతాడా..?

రాహుల్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు అదే కుటుంబానికి చెందిన ప్రియాంకా వాద్రా పేరును పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తెరపైకి తీసుకొస్తున్నారు. నాన్నమ్మ పోలికలున్న ప్రియాంకా అయితే అధికార బీజేపీపై రాజకీయంగా పోరాడుతారని, పార్టీ బలమైన గొంతుకగా నిలుస్తారని వారు ఆశిస్తున్నారు. అయితే ప్రియాంకా పార్టీకి అవసరమున్న ప్రతీ సందర్భంలో వచ్చి ప్రచారం చేశారు. అన్న రాహుల్‌కు ఎన్నికల ప్రచారంలో అండగా నిలిచారు. అధికార పక్షంలో తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం చేశారు. అయితే ప్రియాంకా పార్టీ ప్రెసిడెంట్‌గా నిలిచేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో గాంధీ – నెహ్రు కుటుంబాలకు చెందిన వారు కాకుండా పార్టీలోని సీనియర్ నాయకులకెవరికన్నా అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. అయితే మళ్లీ రాహుల్‌కే పార్టీ పగ్గాలు తిరిగి అప్పజెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?