Congress wants KTR: కేటీఆర్ సీఎం కావాలి.. కాంగ్రెస్‌ నేతల్లో చర్చ

Congress leaders want KTR as Chief Minister of Telangana: కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని టీఆర్ఎస్ వర్గాలే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కోరుకుంటున్నారట. వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. ఇది నిజమని అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కీలక మార్పులు రాబోతున్నాయట. ముఖ్యమంత్రి సీట్లో కేటీఆర్‌ కూర్చొబోతున్నారట. ఈ వార్తలు ఈ మధ్య తెగ వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ న్యూస్‌ హల్‌చల్‌ చేయడంలో రాజకీయ పార్టీల్లో కూడా తీవ్ర […]

Congress wants KTR: కేటీఆర్ సీఎం కావాలి.. కాంగ్రెస్‌ నేతల్లో చర్చ
Follow us

|

Updated on: Feb 13, 2020 | 6:18 PM

Congress leaders want KTR as Chief Minister of Telangana: కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని టీఆర్ఎస్ వర్గాలే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కోరుకుంటున్నారట. వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. ఇది నిజమని అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కీలక మార్పులు రాబోతున్నాయట. ముఖ్యమంత్రి సీట్లో కేటీఆర్‌ కూర్చొబోతున్నారట. ఈ వార్తలు ఈ మధ్య తెగ వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ న్యూస్‌ హల్‌చల్‌ చేయడంలో రాజకీయ పార్టీల్లో కూడా తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ స్థానంలో కేటీఆర్ రావాలని కోరుకుంటున్నారట.

కేటీఆర్‌ సీఎం అవుతారని ప్రచారం నేపథ్యంలో ప్రతిపక్షంలో కూడా ఈ విషయంపై ఆసక్తి నెలకొంది. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో ప్రతిపక్షంలోని పార్టీలు.. నేతలు ఇప్పుడు ఈవిషయంపై డిస్కస్ చేస్తున్నారు. గ్రూపులు గ్రూపులుగా ఏం జరుగుతోంది అని ఆరా తీస్తున్నారు.

ఇక కాంగ్రెస్‌ అధికారిక సమావేశాల్లో కూడా ఈ విషయం చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ మార్పు జరిగితే ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి? రాజకీయంగా వచ్చే మార్పులేంటి? అనే విషయాలపై కాంగ్రెస్‌ నేతలు చర్చలు నడుపుతున్నారట. ఇక నుంచి కేటీఆర్‌ టార్గెట్‌గా రాజకీయాలు నడపాలని అనుకుంటున్నారట.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాజకీయంగా కాంగ్రెస్‌ నేతలు పోటీ పడలేకపోయారట. ఆయనతో సరితూగే నేత తమ పార్టీలో లేరట. కేసీఆర్‌తో పోరాటం అంటే అన్ని విషయాల్లో ఆరితేరి ఉండాలని.. అలాంటి నేత లేకపోవడంతో ఫైటింగ్‌ చేయలేకపోయామని కొందరు కాంగ్రెస్‌ నేతల భావన. ఇప్పుడు కేటీఆర్‌ వస్తే…కాస్తా ఫైటింగ్‌ ఈజీ అవుతుందని ఈ నేతలు ఆలోచిస్తున్నారట.

వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్‌ను ఇన్నాళ్లు కేటీఆర్‌ టార్గెట్‌ చేశారు. ఎన్నికల ప్రచారంలోనే కాదు. సమయం, సందర్భం వచ్చినపుడల్లా కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలపై విరుచుకుపడేవారు. ఇప్పుడు కేటీఆర్‌ సీఎం అయితే… అదే వారసత్వ రాజకీయాలపై విమర్శలు బలంగా చేయాలనేది కాంగ్రెస్‌ ఆలోచన.

మరోవైపు కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఆయన సీఎం సీట్లకు రావాలని కోరుకుంటున్నాయి. ఆయన అయితే తమ రాజకీయం యుద్ధం తేలిక అవుతాయని భావిస్తోంది. మరీ ప్రతిపక్షాల కోరికను గులాబీ అధినేత మన్నిస్తారో లేదో చూడాలి.