కుక్క ప్రాణాలకు ఉన్న విలువ తెలంగాణ ప్రజలకు లేదు: విజయశాంతి

తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లో శనివారం ‘హస్కీ’ అనే కుక్క మృతి చెందింది. 11 నెలల హస్కీ అనారోగ్యానిక గురై మృతి చెందింది. అయితే.. ప్రగతి భవన్‌ డాగ్స్‌ హ్యాండ్లర్‌ ఆసిఫ్‌ అలీఖాన్‌.. రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ వైద్యుడు వచ్చి చికిత్స అందించాడు. తీవ్రంగా జ్వరం ఉండటంతో లివర్‌ టానిక్‌ ఇచ్చాడు. ఆ తరువాత హస్కీ ఆరోగ్యం మరింత విషమించి మృతి చెందింది. అయితే.. ఈ హస్కీ మృతిపై […]

కుక్క ప్రాణాలకు ఉన్న విలువ తెలంగాణ ప్రజలకు లేదు: విజయశాంతి
Follow us

| Edited By:

Updated on: Sep 15, 2019 | 1:55 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లో శనివారం ‘హస్కీ’ అనే కుక్క మృతి చెందింది. 11 నెలల హస్కీ అనారోగ్యానిక గురై మృతి చెందింది. అయితే.. ప్రగతి భవన్‌ డాగ్స్‌ హ్యాండ్లర్‌ ఆసిఫ్‌ అలీఖాన్‌.. రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ వైద్యుడు వచ్చి చికిత్స అందించాడు. తీవ్రంగా జ్వరం ఉండటంతో లివర్‌ టానిక్‌ ఇచ్చాడు. ఆ తరువాత హస్కీ ఆరోగ్యం మరింత విషమించి మృతి చెందింది.

అయితే.. ఈ హస్కీ మృతిపై రాజకీయంగా.. రచ్చ జరుగుతోంది. తాజాగా.. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘తెలంగాణ సీఎం కెసిఆర్ గారి క్యాంపు కార్యాలయంలో కుక్క ప్రాణాలకు ఉన్న విలువ కూడా తెలంగాణ ప్రజలకు లేదనే విషయం అర్థం స్పష్టమయ్యింది. విషజ్వరాల బారినపడి… తెలంగాణలోని అమాయక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా… ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని ఆరోగ్యశాఖ అధికారులపై చర్యలు ఉండవు’.

‘గ్లోబరీనా సంస్థకు ఇంటర్ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పచెప్పి.. ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పుకు చాలామంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయినా… దీనికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. కానీ… సీఎం కేసీఆర్ గారు, ఆయన కుటుంబసభ్యులు ఎంతో ప్రేమగా పెంచుకున్న హస్కీ అనే కుక్క జ్వరం వచ్చి చనిపోతే మాత్రం చర్యలు మామూలుగా లేవు. ఆ కుక్కకు సరైన విధంగా వైద్యం అందించకపోవడంతోనే మరణించిందనే కారణంతో.. దానికి చికిత్స చేసిన డాక్టర్ రంజిత్‌పై ఐపీసీ 429 సెక్షన్ 11(4) కింద, ప్రివెంటివ్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ కింద కేసు పెట్టినట్లు పత్రికల్లో వచ్చిన వార్తను చూసి తెలంగాణ సమాజం నివ్వెరపోయింది. కేసీఆర్ అనుసరిస్తున్న ఈ దొరతనాన్ని సహించలేకే ఇటీవల కాలంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారనే వాదన కూడా ఉంది. అసమ్మతి గళం వినిపిస్తున్న ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను ప్రలోభపెట్టి బెదిరించి కెసిఆర్ గారు లొంగ తీసుకోవచ్చేమో గానీ సంక్షోభాన్ని ఎంతో కాలం నివారించలేరు’. అంటూ.. ఆమె కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..