ఆర్‌ఎస్ఎస్ చీఫ్‌పై పోలీసులకు వీహెచ్‌ ఫిర్యాదు

ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంత రావు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 25వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ సభలో.. భారతదేశంలో ఉన్న 130కోట్ల మంది హిందువులేనంటూ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై వీహెచ్ ఫిర్యాదు చేశారు. భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ […]

ఆర్‌ఎస్ఎస్ చీఫ్‌పై పోలీసులకు వీహెచ్‌ ఫిర్యాదు
Follow us

| Edited By:

Updated on: Dec 31, 2019 | 12:45 AM

ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంత రావు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 25వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ సభలో.. భారతదేశంలో ఉన్న 130కోట్ల మంది హిందువులేనంటూ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై వీహెచ్ ఫిర్యాదు చేశారు. భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. అయితే ఫిర్యాదుపై ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, న్యాయ సలహా తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

కాగా, డిసెంబర్ 25వ తేదీన సరూర్ నగర్‌ స్టేడియంలో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ బహిరంగ సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 10వేల మందికి పైగా హాజరయ్యారు. అంతకుముందు 8వేల మంది స్వయం సేవకులు మూడు శ్రేణులుగా విడిపోయి.. 10 కిలోమీటర్ల మేర పథ సంచలన్ చేశారు. ఈ సభలోనే భగవత్ ఎన్నార్సీ, పౌర సవరణ చట్టాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.