హస్తంలో చిచ్చురేపిన యురేనియం..!

Congress leader Sampath Fires on TPCC Chief, హస్తంలో చిచ్చురేపిన యురేనియం..!

యురేనియం తవ్వకాల అంశం కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. మంగళవారం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో యురేనియంపై చర్చించారు. అయితే అఖిలపక్ష సమావేశం నిర్వహించడంపై సంపత్ ఫైర్ అయ్యారు. యురేనియం అంశాన్ని తెర మీదకు తెచ్చింది తామని, యురేనియంకు పవన్ కళ్యాణ్‌కు సంబంధం ఏంటని సంపత్ ప్రశ్నించారు. జాతీయ పార్టీ వెళ్లి జనసేన జెండా కింద కూర్చొవడమేంటని అన్నారు. అలా చేయడం ఎలాంటి సంకేతాలు వెళ్తాయో ఆలోచించారా అంటూ మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పిలిచినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడా..? అని, సీనియర్ నేతలంతా వెళ్లి పవన్ దగ్గర కూర్చోవడం ఏంటంటూ సంపత్‌ ప్రశ్నించారు. అయితే సంపత్ అభిప్రాయంతో కుంతియా కూడా ఏకీభవించారు. అఖిలపక్ష సమావేశానికి సీనియర్లు వెళ్లడం తప్పేనని కుంతియా చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *