రేపు టీఆర్‌ఎస్‌లోకి సబిత ఇంద్రారెడ్డి?

కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. పార్టీని వీడకుండా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఆమెతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సబితాఇంద్రారెడ్డి రేపు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్టు సమాచారం. మహేశ్వరం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సబిత తన కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరారు. కాంగ్రెస్ అధిష్టానం అందుకు విముఖత వ్యక్తం […]

రేపు టీఆర్‌ఎస్‌లోకి సబిత ఇంద్రారెడ్డి?
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 7:57 PM

కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. పార్టీని వీడకుండా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఆమెతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సబితాఇంద్రారెడ్డి రేపు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్టు సమాచారం. మహేశ్వరం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సబిత తన కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరారు. కాంగ్రెస్ అధిష్టానం అందుకు విముఖత వ్యక్తం చేయడంతో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. చేవెళ్ల నుంచి గతంలో టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దీంతో కార్తీక్ రెడ్డికి టీఆర్‌ఎస్‌లో ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!