రూ.400 కోట్ల హవాలా సొమ్ము ఏమైంది ? కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కు ఐటీ శాఖ నోటీసులు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,  పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజకీయ సలహాదారైన అహ్మద్ పటేల్ కు ఐటీ శాఖ ఈ నెల 11 న నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన ఈ నెల 14 న ఆయన  ఈ శాఖ కార్యాలయంలో హాజరు కావలసి ఉంది.

రూ.400 కోట్ల హవాలా సొమ్ము ఏమైంది ? కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కు ఐటీ శాఖ నోటీసులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 20, 2020 | 1:48 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,  పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజకీయ సలహాదారైన అహ్మద్ పటేల్ కు ఐటీ శాఖ ఈ నెల 11 న నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన ఈ నెల 14 న ఆయన  ఈ శాఖ కార్యాలయంలో హాజరు కావలసి ఉంది. కానీ ఆయన హాజరు కాకపోవడంతో మళ్ళీ ఈ నెల 18 న పటేల్ కు నోటీసులు జారీ అయ్యాయి. తనకు శ్వాస సంబంధ సమస్యలు ఉన్నాయని, ఫరీదాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, అందువల్ల తన ఆరోగ్య కారణాల దృష్ట్యా హాజరు కాలేకపోతున్నానని పటేల్ పేర్కొన్నారు. ఆయన రూ. 400 కోట్ల హవాలా లావాదేవీలను నడుపుతున్నట్టు  ఐటీ అధికారులు గుర్తించారు. వివిధ మార్గాల ద్వారా  ఈ నిధులు పార్టీకి అందుతున్నాయని, ఈ వ్యవహారంలో  పటేల్ పాత్ర కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నామని వారు తెలిపారు.