Nagarjunasagar By-poll: ఉప ఎన్నిక బరిలో జానానా? మరొకరా? పార్టీ వర్గాల్లో కన్ఫ్యూజన్.. స్పందించని హైకమాండ్

నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారు ..? కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.జానారెడ్డినా .. లేక మరొకరికి అవకాశం దక్కనున్నదా? ఈ చర్చ ఇపుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో జోరందుకున్నది.

Nagarjunasagar By-poll: ఉప ఎన్నిక బరిలో జానానా? మరొకరా? పార్టీ వర్గాల్లో కన్ఫ్యూజన్.. స్పందించని హైకమాండ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 02, 2021 | 6:59 PM

Congress cadre under confusion over Nagarjunasagar candidate: నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారు ..? గత ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.జానారెడ్డినా .. లేక ఆయన కుమారుడు రఘువీరారెడ్డినా..? 2014లో గెలిచి.. 2018లో ఓడిన కే.జానారెడ్డినే సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి అని పార్టీ సీనియర్లు చెబుతున్నా.. పెద్దాయన మాత్రం ఇప్పటి దాకా క్లారిటీ ఇవ్వలేదు. దాంతో జానారెడ్డి సన్ స్ట్రోక్ బారిన పడ్డారన్న కామెంట్లు నియోజకవర్గంలో జోరందుకున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో సవాల్ నాగార్జున సాగర్ ఉపఎన్నిక రూపంలో ఎదురు కాబోతోంది. సాగర్ ఉపఎన్నిక టీ.కాంగ్రెస్ నేతలకు జీవన్మరణ సమస్య అనే చెప్పాలి. ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ నేతలకు అనివార్యంగా మారింది. రాష్ట్రంలో మొన్నటి దాకా టీఆర్ఎస్ వరుస విజయాల పరంపర కొనసాగింది. కారు స్పీడ్‌కు బ్రేకులు వేస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని బీజేపీకి వదులుకుంది. దుబ్బాక ఉపఎన్నికలో కారుకు, హస్తానికి షాక్ ఇచ్చారు కమలనాథులు. రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం .. దుబ్బాకలో గెలవడం కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలిచి ఉనికి చాటుకోవాలని చూస్తున్నారు హస్తం నేతలు.

సాగర్‌లో తమ గెలుపునకు పూర్తి స్థాయిలో అవకాశం ఉందని హస్తం నేతలు ధీమాగా ఉన్నారు. ప్రాథమికంగా పార్టీ నిర్వహించిన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలున్నాయని తేలడంతో హస్తం నేతల్లో ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జానారెడ్డి అభ్యర్థిగా సాగిన ఆ సర్వేలో కాంగ్రెస్ వైపు మెజారిటీ ఓటర్లు జై కొట్టారని తెలుస్తోంది. దీంతో జానారెడ్డినే అభ్యర్థి అని అందరు సీనియర్లు చెబుతున్నారు. కానీ పోటీ విషయంలో జానారెడ్డి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దీనికి తోడు ఇటీవల జానారెడ్డి తన కొడుకు రఘువీర్ రెడ్డి అభ్యర్థిత్వంపై చేసిన కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.

అయితే సాగర్ అభ్యర్థిత్వంపై జానారెడ్డి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కారణం ఆయన కుమారుడే అని తెలుస్తోంది. ఈసారి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి తండ్రిపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొడుకు ఒత్తిడితో జానారెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. అందుకే పోటీపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని తెలుస్తోంది. పార్టీ నాయకులంతా మూకుమ్మడిగా మీరే నిలబడాలి అని జానాపై వత్తిడి తెస్తున్నా.. ఆయన మాత్రం ఎక్కడా తన మనసులోని మాటను బయట పెట్టడం లేదు. ఎఐసిసి రాష్ట్ర ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్.. జానారెడ్డి అభ్యర్థిత్వంపై స్పష్టత ఇచ్చినా.. ఈయన మాత్రం నోరు మెదపలేదు.

ప్రస్తుతానికి నియోజకవర్గంలో తండ్రి, కొడుకులు కలిసి తిరుగుతున్నప్పటికీ .. పోటీ చేసే అభ్యర్థి జానారెడ్డినా లేక ఆయన కొడుకా అనే కన్ఫ్యూజన్ మాత్రం క్యాడర్‌ను వీడటం లేదు. పార్టీ వర్గాలతోపాటు ప్రచారంలో కీలకంగా వ్యవహరించే లీడర్లలో వీలైనంత త్వరగా కన్ఫ్యూజన్‌కు తెరపడాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అధిష్టానం సాగర్ అభ్యర్థిని అధికారికంగా వీలైనంత త్వరగా ప్రకటిస్తేనే ఉప ఎన్నికలో విజయం సాధించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?