హుజూర్‌నగర్‌‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి

Congress announces Padmavathi Reddy as its candidate from Huzurnagar by polls, హుజూర్‌నగర్‌‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి

హుజూర్‌నగర్ బై ఎలక్షన్స్‌ పోరుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని కూడా ప్రకటించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఒకే వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీగా ఉండటం కుదరదు కాబట్టి.. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్ నగర్ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఇదే స్థానంపై కన్నేశాయి. ఎలాగైనా హుజూర్ నగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీతో సహా.. అటు బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి.. హస్తం గాలి వీయడం ఖాయమని అంతా భావిస్తున్నారు. అయితే ముందుగా అభ్యర్ధిని ప్రకటిస్తే.. గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఆలోచనతో టీ-కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్.. హుజూర్ నగర్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ సతీమణి పద్మావతి పేరు ప్రకటించారు. అయితే ఇంకా అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *