రైతుల బంద్‌కు రాజకీయ పార్టీల మద్దతు… ఆందోళనలకు పిలుపునిస్తున్న పొలిటికల్ లీడర్లు…

రైతులు చేస్తున్న ఆందోళనలు 11 రోజుకు చేరాయి. ప్రభుత్వాలు రైతుల డిమాండ్లు తీర్చేందుకు సమయం కోరాయి... కాగా, రైతులు 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆ పిలుపునకు కాంగ్రెస్, తెరాస, డీఎంకే, ఆప్ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.

రైతుల బంద్‌కు రాజకీయ పార్టీల మద్దతు... ఆందోళనలకు పిలుపునిస్తున్న పొలిటికల్ లీడర్లు...
Follow us

| Edited By: Venkata Narayana

Updated on: Dec 07, 2020 | 12:12 AM

కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు నూతన రైతు చట్టాలకు తీసుకొచ్చింది. అయితే ఆ చట్టాలు రైతులకు మేలు చేసే విధంగా కాకుండా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాచేలా ఉన్నాయని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీలో తమ నిరసనను వ్యక్తం చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు రైతులకు రాజకీయ పార్టీల మద్దతు లభిస్తోంది. డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు సైతం పొలిటికల్ పార్టీలు సైతం కదిలొస్తున్నాయి.

బంద్‌లో పాల్గొననున్న పార్టీలివే…

రైతులు చేస్తున్న ఆందోళనలు 11 రోజుకు చేరాయి. ప్రభుత్వాలు రైతుల డిమాండ్లు తీర్చేందుకు సమయం కోరాయి… కాగా, రైతులు 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆ పిలుపునకు కాంగ్రెస్, తెరాస, డీఎంకే, ఆప్ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. 8న రైతులకు సంఘీభావంగా ర్యాలీలు, ఆందోళనలు చేయాలని పిలుపునిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా బీజేపీ వ్యవసాయ వ్యతిరేక చట్టాలను చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు రైతులకు మద్దతుగా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు.

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. పార్టీ శ్రేణులు ప్రత్యక్షంగా ఉద్యమించాలని కోరారు. రైతుల సమ్మెకు దేశ ప్రజలు సహకరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. కమల్‌హాసన్ సైతం రైతులకు మద్దతుగా నిలిచారు. డీఎంకే నేత స్టాలిన్ రైతులకు సంఘీభావంగా తమిళనాట ఆందోళనలు చేస్తామని అన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని త‌ృణమూల్, ఆర్జేడీ, వామపక్షాలు ఇప్పటికే మద్దతు ఇచ్చాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి శరద్ పవార్ కేంద్రానికి హెచ్చరికలు చేశారు. వీలైనంత త్వరగా డిమాండ్లను తీర్చాలని సూచించారు.