GHMC Election Results 2020 : మలక్‌పేట్ నియోజకవర్గ కౌంటింగ్ సెంటర్‌లో గందరగోళం.. ఇబ్బంది పడుతున్న సిబ్బంది…

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అంబర్‌పేట ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మలక్‌పేట్ నియోజకవర్గ..

GHMC Election Results 2020 : మలక్‌పేట్ నియోజకవర్గ కౌంటింగ్ సెంటర్‌లో గందరగోళం.. ఇబ్బంది పడుతున్న సిబ్బంది...
Follow us

| Edited By: Team Veegam

Updated on: Dec 04, 2020 | 1:38 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అంబర్‌పేట ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మలక్‌పేట్ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రం లోపల స్పేస్ లేకపోవడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా నడుస్తోంది. నాలుగు డివిజన్లకు సరిపడే కౌంటింగ్ స్పేస్ ఉన్న చోట ఏడు డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ నిర్వహిస్తుండటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, మరో 20 నిమిషాల తరువాత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో ఆరు డివిజన్లలో బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తయింది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒక్కో టేబుల్ దగ్గర వెయ్యి ఓట్ల చొప్పున 14 టేబుళ్లలో 14వేల ఓట్లను లెక్కించనున్నారు.

Read more:

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..