Conditional Lockdown Extension: షరతులతో కూడిన లాక్‌డౌన్‌ పొడిగింపు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Conditional Lockdown Extension: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి....

Conditional Lockdown Extension: షరతులతో కూడిన లాక్‌డౌన్‌ పొడిగింపు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
Follow us

|

Updated on: Dec 31, 2020 | 5:19 PM

Conditional Lockdown Extension: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతుండటంతో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షరతులతో కూడిన లాక్‌డౌన్‌ ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కానీ నిబంధనలతో కూడిన ఆంక్షలు ఉంటాయని తెలిపింది. జనవరి 31వ తేదీ వరకు షరతులతో కూడిన లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు రావడానికి ఈ-పాస్‌ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

మెరీనా బీచ్‌లో ప్రజలు గుమిగూడవద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇప్పటికే నేడు, రేపు న్యూఇయర్ ‌వేడుకలపై నిషేధం విధించిన ప్రభుత్వం.. తాజాగా ఈ లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ పెరుగుతుండటం, అలాగే న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉండటంతో ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టకపోవడం, అందులో కొత్త కరోనా వైరస్‌ దేశంలోకి వ్యాపిస్తుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఈ లాక్‌డౌన్‌ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

Also Read: Maharashtra Lockdown Extends: పెరుగుతున్న కరోనా కేసులు.. జనవరి 31 వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు పొడిగింపు