యాడ్ ఎఫెక్ట్.. హీరోయిన్ అంజలిపై ఫిర్యాదు

సినీ హీరోయిన్ అంజలి మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోవై సుడర్ మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు సత్య గాంధీ గురువారం కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఓ కల్తీ వంట నూనె కంపెనీకి అంజలి ప్రచారకర్తగా వ్యవహరిస్తుందని.. ఇటీవల ఆ వంట నూనెను తాము ల్యాబ్‌కు పంపించి టెస్టులు చేయించగా హానికరం అని తేలిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వంట నూనెలు విక్రయించడం ప్రజల ఆరోగ్యాలతో […]

యాడ్ ఎఫెక్ట్.. హీరోయిన్ అంజలిపై ఫిర్యాదు
రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించింది అంజలి. ఈ సినిమాలో అంజలి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 
Follow us

| Edited By:

Updated on: Oct 04, 2019 | 10:33 AM

సినీ హీరోయిన్ అంజలి మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోవై సుడర్ మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు సత్య గాంధీ గురువారం కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఓ కల్తీ వంట నూనె కంపెనీకి అంజలి ప్రచారకర్తగా వ్యవహరిస్తుందని.. ఇటీవల ఆ వంట నూనెను తాము ల్యాబ్‌కు పంపించి టెస్టులు చేయించగా హానికరం అని తేలిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వంట నూనెలు విక్రయించడం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటమేనని సత్య గాంధీ అందులో వివరించారు. దీనికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అంజలి.. ఒక రకంగా ప్రజలను మోసం చేస్తున్నారని.. ఆమెపై కేసు నమోదు చేసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వీలైనంత త్వరగా ఆ వంట నూనె కంపెనీపై చర్యలు తీసుకొవాలని అధికారులను కోరారు. కాగా ఈ-రోడ్డు ప్రధాన కార్యాలయంగా ఈ నూనె కంపెనీ కొనసాగుతోంది.

అయితే ఈ యాడ్స్‌ వివాదంలో చిక్కుకోవడం హీరో హీరోయిన్లకు కొత్తేం కాదు. ఇటీవల విజయవాడలోని వినియోగదారుల న్యాయస్థానం రాశి, రంభ నటించిన ఓ వాణిజ్య ప్రకటనను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆ మధ్యన క్యూనెట్ వివాదంలో పూజా హెగ్డే, బొమన్ ఇరానీ, షారూక్ ఖాన్, అల్లు శిరీష్ తదితరులకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో హీరోలు,హీరోయిన్లు కమర్షియల్ యాడ్స్‌లో నటించేముందు కాస్త వాటి వివరాలు తెలుసుకుంటే మంచిదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. లేకపోతే దాని ఫలితం ప్రజలతో పాటు వారిపై కూడా పడే ప్రభావం ఉందని వారు అంటున్నారు.