“ఐసోలేషన్ బెడ్స్” ధరపై హైపవర్ కమిటీ కీలక నిర్ణయం

దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కోవిడ్ చికిత్స నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు కూడా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో ప్రైవేటులోనూ కోవిడ్ టెస్టులు, చికిత్స అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడినీ అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే కోవిడ్ ఐసోలేషన్ బెడ్స్‌పై..

ఐసోలేషన్ బెడ్స్ ధరపై హైపవర్ కమిటీ కీలక నిర్ణయం
Follow us

|

Updated on: Jun 19, 2020 | 5:40 PM

దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కోవిడ్ చికిత్స నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు కూడా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో ప్రైవేటులోనూ కోవిడ్ టెస్టులు, చికిత్స అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడినీ అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే కోవిడ్ ఐసోలేషన్ బెడ్స్‌పై కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన ఏర్పడిన హైపవర్ కమిటీ శుక్రవారం కీలక నిర్ణయాలను వెల్లడించింది.

నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అధ్యక్షతన ఈ కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. 60 పడకలు తక్కువ రేటుకే లభించేలా చూడటానికి, మరియు కరోనా పరీక్షల రేటును నిర్ణయించడానికి ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీ నిర్ణయం మేరకు కరోనా రోగులకు సంబంధించి ఐసోలేషన్ బెడ్స్‌ ధర 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు మాత్రమే ఉండాలని, ఈ నిబంధన అన్ని ఆస్పత్రులకూ వర్తిస్తుందని హైపవర్ కమిటీ ప్రకటించింది. ఇక, ఐసీయూలోని వెంటిలేటర్‌ ఖర్చు 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకూ మాత్రమే విధించాలని కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన వెలువరించింది.