Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

బాలయ్యకు దోస్త్‌గా సునీల్..!

Sunil as a Bala Krishna Friend In Nbk 106, బాలయ్యకు దోస్త్‌గా సునీల్..!

హీరోగా హిట్స్ లేక అలసిపోయిన సునీల్..మళ్లీ కయెడియన్ కమ్ నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అదే ట్రాక్ కొనసాగిస్తూ..ఇటీవలే ‘అల వైకుంఠపురంలో’, ‘డిస్కో రాజా’ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే సునీల్ రీసెంట్‌గా అనారోగ్యానికి గురైయ్యాడు. ఇప్పుడే కొద్ది కొద్దిగా రికరవుతున్నాడు. అయితే ఇతడికి సినిమా ఛాన్సులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ‘కలర్ ఫోటో’ అనే చిన్న బడ్జెట్ మూవీ ఒప్పకున్న సునీల్..అందులో తన చిరకాల కోరిక అయిన విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడు.

తాజాగా సునీల్‌కి బంఫర్ ఆఫర్ పట్టేశాడని ఫిల్మ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబో ప్రస్తుతం ఓ చిత్రం తెరకెక్కనుంది. అందులో సునీల్‌ను బాలయ్య ఫ్రెండ్ పాత్రకిగానూ సెలక్ట్ చేసుకున్నాడట దర్శకుడు. బాలయ్య, బోయపాటి కాంబోలో గతంలో  ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి సంచలన విజాయాలు నమోదు చేశాయి. ఇప్పడు కూడా సినిమాపై భారీ బజ్ నెలకుంది. అందులోనూ తన సినిమాల్లో కామెడీ కోసం స్పెషల్ ట్రాక్ రాసుకుంటాడు బోయపాటి. ఇప్పటికైతే కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సునీల్ తన మార్క్ ఓల్డ్ కామెడీతో నవ్వించిన సినిమాలు రాలేదు. మరి బోయపాటి, సునీల్‌ పాత రోజులను తిరిగి తీసుకువస్తాడేమో వేచి చూడాలి. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం.

 

Related Tags