Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

పృథ్వీకి చైర్మన్ పదవి.. మరి అలీకి..?

సీనియర్ కమెడియన్ పృథ్వీ ఆ తర్వాత వైసీపీ నేత అయ్యారు. ఇప్పుడు ఎస్వీబీసీ చైర్మన్ అయ్యారు.కానీ.. సీనియర్ కమెడియన్ అలీ మాత్రం ఇంకా వైసీపీ లీడర్ గానే ఉన్నారు. ఎన్నికలకు ముందు మంత్రి పదవి ఇచ్చే పార్టీలోనే చేరతానన్న అలీ.. వైసీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ కూడా దక్కించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు అలీ విషయంలో జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంతకీ సీఎం మనసులో ఏముంది ? అలీకి ఏం పదవి ఇవ్వబోతున్నారు..?

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీని పరిశ్రమ కేంద్రంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికల సమరంలో జగన్ ఒంటరిగా యుద్ధం చేస్తున్న వేళ.. టాలీవుడ్ నుంచి లభించిన మద్దతు చాలా తక్కువ. కమెడియన్ పృథ్వీ, అలీ.. ఇలా చాలా కొద్ది మంది మాత్రమే వైసీపీకి జై కొట్టారు. మోహన్ బాబు, జయసుధ లాంటి వాళ్లు లాస్ట్ మినిట్ లో వైసీపీలో చేరారు. అలానే వైసీపీ విజయం సాధించాక కూడా టాలీవుడ్ నుంచి అభినందనల వెల్లువ మొదలు కాలేదు. అయితే వైసీపీకి అండగా నిలిచిన స్టార్స్ కి ఎలాంటి గౌరవం దొరుకుతుందన్న ఆసక్తి పెరుగుతూ వచ్చింది. పాదయాత్ర నుంచి ఎన్నికల ప్రచారం దాకా యాక్టివ్ గా వ్యవహరించిన కమెడియన్ పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు.

పృథ్వీకి ఇంత కీలక పదవి ఇవ్వడంతో మరి అలీ సంగతేంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే అలీకి ఎఫ్ డీ సీ చైర్మన్ పదవి ఖాయమంటూ పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు మొదలయ్యాయి. మరి జగన్ అలీకి ఎఫ్ డీ సీ పదవి ఖాయం చేస్తారా.. లేదా..? ఆసక్తిగా మారింది.