Breaking News
  • ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చ. మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు-హోంమంత్రి సుచరిత. మహిళల రక్షణ, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మహిళామిత్ర విభాగం ఏర్పాటు చేశాం. మహిళా కానిస్టుబుళ్లను నియమించాం. ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై కౌన్సెలింగ్‌. బాల్య వివాహాల నియంత్రణకు అవగాహన కల్పిస్తున్నాం-సుచరిత.
  • ప్రతి రైతుబజార్‌లో ఉల్లిని ప్రభుత్వం విక్రయిస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం. 36,536 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నాం. మేం రూ.25కే కిలో ఉల్లి ఇస్తే హెరిటేజ్‌లో రూ.200కు అమ్ముతున్నారు.
  • మహిళల భద్రతపై చర్చిస్తుంటే టీడీపీ అడ్డుకుంటోంది. ఉల్లిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది-మంత్రి బుగ్గన. మహిళల పట్ల ప్రతిపక్షానికి బాధ్యతలేదు-మంత్రి బుగ్గన.
  • టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళల భద్రత అవసరం లేదా-ఎమ్మెల్యే రజని. మహిళలు అభద్రతాభావంతో ఉన్నారు. మహిళల భద్రతపై మాట్లాడుతుంటే అడ్డుకుంటారా. మహిళల రక్షణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-ఎమ్మెల్యే రజని. మహిళలపై టీడీపీ నేతల నేరాలు బయటపడతాయనే చర్చను అడ్డుకుంటున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి-ఎమ్మెల్యే రజని.
  • టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహం. ఉల్లి ధరలపై సీఎం చర్చిస్తామన్నారు. మహిళల భద్రతపై చర్చను అడ్డుకోవడం తగదు. చర్చకు సహకరించాలని కోరిన స్పీకర్‌ తమ్మినేని.
  • దిశ ఘటనతో మహిళలందరూ తల్లడిల్లిపోయారు-రోజా. సీఎం జగన్‌పై మహిళలందరికీ నమ్మకం ఉంది. మహిళలందరూ తమ గోడును జగన్‌కు చెప్పాలనుకుంటున్నారు. ఒక మహిళను హోంమంత్రి చేసిన ఘనత జగన్‌ది. హోంమంత్రి మాట్లాడుతుంటే టీడీపీ అడ్డుకుంటోంది. కాల్‌మనీ, లోకేష్‌ ఫొటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై.. చర్చ జరుగుతుందేమోనని టీడీపీ అడ్డుకుంటోంది. మహిళలంటేనే టీడీపీ నేతలకు చులకన భావం. మహిళల భద్రతపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-రోజా. దిశ ఘటన తర్వాత మహిళలు భయపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి-రోజా. ఆంధ్రప్రదేశ్‌ అంటే ఆడవాళ్లప్రదేశ్‌గా మారాలి-రోజా. రేప్‌ చేసి చంపినప్పుడు గుర్తురాని మానవ హక్కులు.. ఎన్‌కౌంటర్‌ చేస్తే ఎందుకు గుర్తుకువస్తున్నాయి. దిశ కుటుంబసభ్యులను హెచ్‌ఆర్సీ ఎందుకు పరామర్శించలేదు-రోజా.
  • ఏపీ శాసనమండలిలో ఉల్లి ధరపై టీడీపీ వాయిదా తీర్మానం. మాతృభాషపై బీజేపీ వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్‌. మండలిలో టీడీపీ సభ్యుల నిరసన.

బిజెపిలోకి బ్రహ్మానందం..ప్రచారం మొదలైందిగా..!

brahmanandam to join bjp soon, బిజెపిలోకి బ్రహ్మానందం..ప్రచారం మొదలైందిగా..!

ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కమెడియన్‌ సీరియస్‌ పాలిటిక్స్‌లోకి అడుగుపెడితే జనం ఎలా రిసీవ్‌ చేసుకుంటారు? ఆ సంగతేమో కానీ, బ్రహ్మానందం కర్నాటకలో ఓ బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. తెలుగువారు ఎక్కువగా వున్న చిక్కబళ్లాపురలో ఆయనకి బ్రహ్మరథం పట్టారు. మిత్రుడికోసం ప్రచారం చేసిన బహ్మానందం త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా ? ఫిలింనగర్‌లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌!

ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తే బ్రహ్మానందం పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం మొదలైంది. ఆయన ఇప్పటికే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కర్నాటక ఉపఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. గతంలో కోట శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక మరో కమెడియన్‌ బాబూమోహన్‌ కూడా బీజేపీలోనే ఉన్నారు. అదే రూటులో ఇప్పుడు బ్రహ్మానందం కూడా బీజేపీలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

కర్నాటకలో డిసెంబర్ ఐదో తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బ్రహ్మానందం, చిక్క బళ్లాపుర నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేశారు. అక్కడి నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచి, తర్వాత జరిగిన పరిణామాలతో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన డాక్టర్‌ సుధాకర్‌ తరపున బ్రహ్మానందం ప్రచారం చేస్తున్నారు. అయితే పార్టీలో చేరటం గురించి క్లారిటీ ఇవ్వకుండా దాటవేస్తున్నారు. సుధాకర్‌ తనకు మిత్రుడని, అందుకే ఆయన గెలుపుకోసం పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు.

బ్రహ్మానందం ప్రచారంలో జోష్‌ కనిపించింది. చిక్కబళ్లాపురలో తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2018లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పనిచేసిన కేవీ నవీన్‌ కిరణ్‌ తరపున హీరో పవన్‌కల్యాణ్ ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో నవీన్‌కుమార్‌, ప్రస్తుతం బరిలో ఉన్న సుధాకర్‌ తర్వాతి స్థానంలో నిలిచారు. ఆయనకి 18.58 శాతం ఓట్లు వచ్చాయి.

ప్రచారం ఏమో గానీ బ్రహ్మానందం బిజెపిలో చేరికపై మాత్రం ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? ఎప్పుడు తీసుకుంటారో? కొన్ని రోజులు వేచి చూస్తే గానీ తెలియదు.