Breaking News
  • సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత. సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్‌ యాదవ్‌.
  • తెలంగాణలో ఇవాళ కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు 471కరోనా పాజిటివ్ కేసులు . ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 412 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • ఈ రోజుతో మార్కస్ కు వెళ్లిన వారితో పాటు 665 టెస్టులు చేస్తే 18 మాత్రమే . 385 మంది మార్కస్ కాంటాక్ట్స్. 45 మంది డిశ్చార్జ్. మొత్తం 414 మంది ట్రీట్మెంట్స్ పొందుతున్నారు. తెలంగాణలో 1ఒక్కరు మాత్రమే వెంటిలేటర్ పై ఉన్నారు. 22 కళ్ళ అందరూ డిశ్చార్జ్ అవుతారు.
  • లాక్‌డౌన్‌తో చుక్కేసుకుంటే కానీ చక్కగా ఉండలేని మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. బ్లాక్‌లో వేలకు వేలు పోసి లిక్కర్‌ బాటిళ్లు కొనుక్కుంటున్నారు. అంత డబ్బు పెట్టలేని సామాన్యులు మాత్రం పిచ్చేక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వైన్‌షాపులు తెరచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారు.
  • నిజామాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.

కేబుల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్..! ఇకపై ధరలు ఎంతంటే..?

Come March.. you can get all free to air channels at ₹160 per month, కేబుల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్..! ఇకపై ధరలు ఎంతంటే..?

కేబుల్ వినియోగదారులకు టెలికమ్‌ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కేబుల్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంది. అంతేకాదు.. ఇప్పుటి వరకు ఎంఎస్‌వోలు అందించిన ఉచిత ఛానెల్ల సంఖ్యను కూడా రెండింతలు పెంచనుంది. ఇక కనీస గరిష్ఠ ధరను కూడా ఫిక్స్ చేయనుంది. ఛానెళ్ల రేట్ల పెంపుపై సరికొత్త నిబంధన అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి.. ఎంఎస్‌వోలకు ట్రాయ్‌ కొత్త గైడ్‌లైన్స్‌‌ను కూడా విడుదల చేసింది. ఇక బ్రాడ్ కాస్టర్లు విధించే చానల్ గరిష్ఠ ధరను.. రూ.19 నుంచి రూ. 12కు తగ్గించింది. ఇక నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజును రూ.130కి ఫిక్స్ చేసింది. ఇప్పటి వరకు ఉచితంగా వచ్చే 100 ఫ్రీ ఎయిర్ ఛానల్స్‌కి బదులు 200 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఇవ్వాలని సూచించింది. అంతేకాదు.. 200కు మించి ఎన్ని ఫ్రీ ఛానల్స్‌కి అయినా.. రూ.160కి మించి చెల్లించనక్కర్లేదని స్పష్టం చేసింది. డీడీ ఛానల్స్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. 26 డిడి చానల్స్ టారీఫ్‌లో కాకుండా అదనమని ట్రాయ్‌ పేర్కొంది.

ఇక ఇప్పటి వరకు ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంటే.. రెండింటికి ఒకే ధరను వసూలు చేసేవారు. కానీ కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం. ఇంట్లో రెండో టీవీ ఉంటే దానికి నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు.. 40 శాతం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ కొత్త గైడ్‌లైన్స్‌ను ఈ జనవరి నెలాఖరు నాటికి వెబ్‌సైట్‌లో ఉంచాలని, మార్చి 1నుంచి వీటిని అమలు చేయాలని ఎంఎస్‌వోలను ట్రాయ్ ఆదేశించింది.

Related Tags