Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

డైట్‌ కంట్రోల్‌తో వ్యాయామం..డేంజర్‌ సుమా !

Combining dieting and exercise may hamper bone health study
అధిక బరువు నియంత్రణ, సన్నగా నాజుగ్గా కనిపించాలనే తాపత్రయంతో ఇటీవల అనేక మంది కఠినమైన డైట్‌లు పాటిస్తూ..అధికశాతం వ్యాయమాలు చేస్తున్నారు. అయితే, డైటింగ్, ఎక్స్‌ర్‌సైజ్‌లు ఎక్కువైతే..అది ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. జర్నల్‌ ఆఫ్‌ బోన్‌ అండ్‌ మినరల్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైన అధ్యయనం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తుంది.
అధిక వ్యాయామం, మితిమీరిన డైట్‌ ప్లాన్‌ ఎముకల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందట.

ఎముకలు లేని మనిషి మాంసపు ముద్దతో సమానం. అతనికి ఒక ఆకారాన్ని ఇచ్చి, ఆ ఆకారాన్ని నడిపించే బాధ్యత ఎముకలదే! 30 ఏళ్ల వరకూ ఎముకల పెరుగుదల వేగంగా ఉంటుంది. ఎముకలు నానాటికీ బలాన్ని పుంజుకుంటాయి. అప్పటివరకూ ఎముకలు తగినంతగా ఎదిగేందుకు అవసరమయ్యే పోషకాలను శరీరానికి అందించాల్సి ఉంటుంది. ఇక 30 ఏళ్ల తరువాత ఎముకల ఎదుగుదల కంటే తరుగుదలే అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ మహిళ్లలో ఎముక ఆరోగ్యం ఎక్కువగా క్షీణించడం మొదలవుతుంది.
ఎక్కువగా వ్యాయమం చేస్తూ.. డైటింగ్‌ ఫాలో అయ్యే వారి శరీరంలో కెలరీలు తగ్గిపోయి…ఎముకల్లో బలం లేకుండా పోయి పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుందట. ఈ మేరకు సీనియర్ రచయిత మాయా స్టైనర్, అసోసియేట్ యుఎస్ లోని నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్‌ ప్రకారం.. 30 ఏళ్ల వయస్సులో ఉన్న సాధారణ మహిళ రోజుకు 2,000 కేలరీలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరానికి సరిపడా కెలరీలను తీసుకుంటూ..తగినంత వ్యాయామం చేస్తే..సరిపోతుందని వారు చెబుతున్నారు. సో సరైనా ఆహారం నిపుణుల సలహా మేరకు వ్యాయామం చేస్తూ..ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవాలని జర్నల్‌ ఆఫ్‌ బోన్‌ అండ్‌ మినరల్‌ రీసెర్చ్‌ సూచిస్తోంది.