కళ్లు చెదిరే రంగుల పండుగ “హోలీ”

హోలీ.. వరల్డ్ మోస్ట్ కలర్‌ఫుల్ ఫెస్టివల్. కళ్లు చెదిరే రంగుల పండుగ. చిన్నా పెద్దా తేడా లేకుండా సందడి చేసే వేడుక. అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ. వసంతకాలంలో కొత్త చిగుర్లకు స్వాగతం పలికే రంగుల రంగేలియే హోలీ. ఎందుకంటే రాష్ట్రానికో పండుగ, జిల్లాకో పండుగ, గ్రామానికో సంబంరం.. ఇలా ఎన్నో ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా జరుగుతుంటాయి. కానీ.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఆహ్లాదంగా, ఆనందంగా జరుపుకునే సరదా పండుగే హోలీ. […]

కళ్లు చెదిరే రంగుల పండుగ హోలీ
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 8:32 AM

హోలీ.. వరల్డ్ మోస్ట్ కలర్‌ఫుల్ ఫెస్టివల్. కళ్లు చెదిరే రంగుల పండుగ. చిన్నా పెద్దా తేడా లేకుండా సందడి చేసే వేడుక. అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ. వసంతకాలంలో కొత్త చిగుర్లకు స్వాగతం పలికే రంగుల రంగేలియే హోలీ. ఎందుకంటే రాష్ట్రానికో పండుగ, జిల్లాకో పండుగ, గ్రామానికో సంబంరం.. ఇలా ఎన్నో ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా జరుగుతుంటాయి.

కానీ.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఆహ్లాదంగా, ఆనందంగా జరుపుకునే సరదా పండుగే హోలీ. వసంతవేల ప్రకృతిలోని రంగుల పూలతో మమేకమయ్యే రోజే ఈ హోలీ పూర్ణిమ. ప్రకృతిలోని రంగులన్నీ మన జీవితంలో వినబూయాలని మనసారా కోరుకుంటూ.. కుల, మత బేధాలు లేకుండా సోదరభావంతో ప్రజలంతా కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుక జరుపుకుంటారు.

ఫాల్గుణ మాసం.. పౌర్ణమి సమయం.. వసంతుడికి ఆహ్వానం పలుకుతూ రంగుల హేలనీ ఆనందాల తుళ్లింతల్నీ వెంటేసుకొస్తుంది హోలీ. వసంత పంచమి, రంగ్ పంచమి, ఫాల్గుణ పౌర్ణమి ఇలా ఏ పేరుతో పిలిచినా దేశ వ్యాప్తంగా ఈ పండుగని జరుపుకునే తీరు మాత్రం ఒకటే. చిన్నాపెద్దా అంతా వీధుల్లో రంగులు చల్లుకుంటూ.. రంగునీళ్లలో తడిసిముద్దవుతూ ఆటపాటల్లో మునిగితేలతారు.

శిశిరంతో మోడువారిన చెట్లన్నీ వసంతం తెచ్చిన రంగులతో విరభూసినట్లే.. పాత మనస్పర్థల్నీ, కోపతాపాల్నీ, పక్కకి నెట్టేస్తూ ఆప్యాయతానురాగాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ఈ హోలీ పండుగ జరుపుకుంటారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ డ్యాన్సులు చేస్తూ ప్రకృతిలో మమేకమవుతారు. మనకైతే ఇది పండుగ మాత్రమే.. కానీ.. నేపాలీయులకి జాతీయ వేడుక. ఒక్క భారత్‌లోనే కాదు ఇతర దేశాల్లోనూ ఈ హోలీని జరుపుకుంటారు.