గుర్రంపై క్రూరత్వం..కటకటాలపాలైన జంట

సాధారణంగా జంతువులను చాలా ప్రేమగా చూసుకుంటాం. కుక్క, పిల్లి, గుర్రం లాంటి మూగజీవాలను ఇంట్లో పెంచుకుంటూ తమ ప్రాణం కంటే మిన్నగా, అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటారు కొంతమంది.  ఇక వాటికేదైనా జరిగితే అస్సలు తట్టుకోలేరు. కానీ అమెరికా కొలరాడోలో ఓ గుర్రం పట్ల ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు ఓ జంట. మూగజంతువనే జాలి కూడా లేకుండా క్రూరంగా ప్రవర్తించారు.  పూర్తిగా మంచు పేరుకుపోయిన రహదారిపై గుర్రాన్ని ట్రక్కుకు కట్టేసి స్పీడ్‌గా నడుపుతూ పైశాచికత్వం ప్రదర్శించారు. పాపం ఆ […]

గుర్రంపై క్రూరత్వం..కటకటాలపాలైన జంట
Follow us

|

Updated on: Nov 28, 2019 | 7:37 PM

సాధారణంగా జంతువులను చాలా ప్రేమగా చూసుకుంటాం. కుక్క, పిల్లి, గుర్రం లాంటి మూగజీవాలను ఇంట్లో పెంచుకుంటూ తమ ప్రాణం కంటే మిన్నగా, అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటారు కొంతమంది.  ఇక వాటికేదైనా జరిగితే అస్సలు తట్టుకోలేరు. కానీ అమెరికా కొలరాడోలో ఓ గుర్రం పట్ల ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు ఓ జంట. మూగజంతువనే జాలి కూడా లేకుండా క్రూరంగా ప్రవర్తించారు.  పూర్తిగా మంచు పేరుకుపోయిన రహదారిపై గుర్రాన్ని ట్రక్కుకు కట్టేసి స్పీడ్‌గా నడుపుతూ పైశాచికత్వం ప్రదర్శించారు. పాపం ఆ మూగజీవి కారు వేగాన్ని అందుకోలేక విలవిలలాడిపోయింది. ఎంత విడిపించుకుందామన్నా లాభం లేకపోయింది. కొంతదూరం పరిగెత్తాక అలసిపోయిన ఆ గుర్రం చివరికి నీరసించి కిందపడిపోయింది.

ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు ఆ జంటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొలరాడోకు చెందిన జాన్‌, అంబర్‌ సాల్డేట్‌ దంపతులు ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించిన అధికారులు. గుర్రానికి వారి నుంచి విముక్తి కల్పించి వారిపై కేసు నమోదు చేశారు. ఆ దంపతులు జనవరిలో కోర్టుకు హాజరుకావలసి ఉంది. చేసిందంతా చేశాక ఇప్పుడు తీరిగ్గా కళ్లు తెరిచిన ఆ జంట తమ తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరారు.