డిప్యూటీ కలెక్టర్‌గా కల్నల్ సంతోష్ బాబు సతీమణి…

అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యలు స్వీకరించారు. శనివారం ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చారు....

డిప్యూటీ కలెక్టర్‌గా కల్నల్ సంతోష్ బాబు సతీమణి...
Follow us

|

Updated on: Aug 15, 2020 | 8:44 PM

ఇండో-చైనా సరిహద్దులో జరిగిన ఘటనలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యలు స్వీకరించారు. శనివారం ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చారు.

సంతోషికి రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొన్నిరోజుల క్రితం ఆమెకు నియామక పత్రాన్నిఅందించిన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు.

హైదరాబాద్ కేబీఆర్ పార్కు సమీపంలో కేటాయించిన 711 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. సంతోష్ బాబు పిల్లల పేరిట రూ. 4 కోట్లు చెక్, ఆయన తల్లిదండ్రులకు కోటి రూపాయల చెక్‌ను అందజేశారు. అలాగే సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా అందజేశారు. జులై నెలలో ఆమెకు అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు. హైదరాబాద్ ప్రాంతంలో పోస్టింగ్ చేయమని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి ట్రైనింగ్ పూర్తయ్యే వరకూ ఆమెకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి…. తన కార్యదర్శి స్మితా సభర్వాల్‌ కు సూచించారు. ఈనేపథ్యంలో తాను విధుల్లోకి చేరడానికి శనివారం బీఆర్‌కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలిసి జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చారు.