Colonel Santosh Babu: కల్నల్‌ సంతోష్‌బాబుకు మహావీరచక్ర పురస్కారం ప్రకటించిన కేంద్రం.. గాల్వాన్‌లోయ పోరాటానికి..

Colonel Santosh Babu: భారత్‌–చైనా సరిహద్దుల్లోని గాల్వన్‌ లోయలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబుకు మహావీరచక్ర పురస్కారం దక్కింది.

Colonel Santosh Babu: కల్నల్‌ సంతోష్‌బాబుకు మహావీరచక్ర పురస్కారం ప్రకటించిన కేంద్రం.. గాల్వాన్‌లోయ పోరాటానికి..
Follow us

|

Updated on: Jan 26, 2021 | 5:10 AM

Colonel Santosh Babu: భారత్‌–చైనా సరిహద్దుల్లోని గాల్వన్‌ లోయలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబుకు మహావీరచక్ర పురస్కారం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం. గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో గతేడాది జూన్‌ 15న సంతోష్‌ వీరమణం పొందిన విషయం తెలిసిందే.

2019 డిసెంబర్‌లో కల్నల్‌గా పదోన్నతి వచ్చింది. బిహార్‌ 16వ బెటాలియన్‌ కామాండింగ్‌ అధికారిగా ఉన్న కల్నల్‌ సంతోష్‌బాబు తాను నేతృత్వం వహిస్తున్న బలగాలతో గాల్వన్‌ లోయల్లో విధులకు వెళ్లారు. కల్నల్‌ సంతోష్‌బాబు తన సర్వీసు ఎక్కువ కాలం సరిహద్దులోనే పని చేశారు. 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా విధులు నిర్వహించాడు. సంతోష్‌బాబు భార్య సంతోషికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌–1 ఉద్యోగ నియామక పత్రంతో పాటు రూ.4 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్‌ అందజేశారు. కల్నల్‌ తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కు ఇచ్చారు.

పవన్ పై ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలపై స్పందించిన నాగబాబు .. గట్టిగా సమాధానం చెప్పిన మెగాబ్రదర్