నివాస గృహాలపై కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి

Colombia plane crash kills seven and injures three, నివాస గృహాలపై కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి

దక్షిణ అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కొలంబియాలో ఓ చిన్న ప్రైవేట్ విమానం గృహసముదాయాలపై కుప్పకూలింది, దీంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన సమయంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పొపయన్‌ నగర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో అక్కడే ఇళ్ల మధ్య ఆడుకుంటున్న ఓ బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ బాలుడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమాన ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *