Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

బీజేపీ నేత చెంప చెల్లుమనిపించిన కలెక్టర్‌..

Collector Nidhi Nivedita slaps BJP leader supporting CAA in MP, బీజేపీ నేత చెంప చెల్లుమనిపించిన కలెక్టర్‌..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజ్‌గఢ్‌ జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసకుంది. జిల్లా కలెక్టర్‌ నివేధిత బీజేపీ నాయకుడి చెంప చెల్లుమనిపించారు. వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్ బయోరాలో సెక్షన్ 144 అమల్లో ఉండగా, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలు కలెక్టర్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలో భారత్ మాతా కి జై నినాదాలు చేస్తోన్న ఓ బీజేపీ కార్యకర్తను  కలెక్టర్ చెంపదెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడే ఉన్న మరికొందరు కార్యకర్తలు కూడా స్లో గన్స్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో సహనం కొల్పోయిన కలెక్టర్ గుంపులోకి వెళ్లి కార్యకర్తలను వన్ బై వన్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఎస్డీఎమ్ ప్రియ వర్మ సైతం కార్యకర్తలపై చేయిచేసుకున్నారు.

Collector Nidhi Nivedita slaps BJP leader supporting CAA in MP, బీజేపీ నేత చెంప చెల్లుమనిపించిన కలెక్టర్‌..

ఈ ఘర్షణలో.. బీజేపీ జిల్లా మీడియా ఇన్‌ఛార్జ్ రవి బనోర్‌ సైతం కలెక్టర్ చేతిలో చెంప తిన్నారు. ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. లాఠీ ఛార్జ్‌‌లో జీరపూర్‌కు చెందిన గిర్రాజ్ జులానియా, పచోర్‌కు చెందిన బిజెపి ప్రధాన కార్యదర్శి వికాస్ క్రొయేషియా, మర్చంట్ సెల్ జిల్లా కన్వీనర్ దీపక్మల్ శర్మ తలకు గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రిలో జాయిన్ చేశారు. సమాచారం అందుకున్న భోపాల్ డిఐజి డాక్టర్ ఆశిష్ నగర పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మొత్తం సంఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. హింసకు యత్నించిన బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. 

Related Tags