ప్లాస్టిక్‌ కొట్టు..కోడిగుడ్లు పట్టు..!

ప్లాస్టిక్‌ కొట్టు…కోడిగుడ్లు పట్టు ఇదేదో టెలివిజన్‌ షోనో, లేక సినిమా యాడ్‌ అనుకుంటున్నారా..? అయితే, మీరు పప్పులో కాలేసినట్టే. కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్‌ మహమ్మారిపై యుద్ధానికి సిద్ధమయ్యారు జిల్లా కలెక్టర్‌. జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్న అధికారులు ఆ దిశగా వినూత్న కార్యక్రామానకి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ప్లాస్టిక్‌కును సేకరించి తెచ్చిన వారికి బదులుగా కోడిగుడ్లను అందజేస్తున్నారు. 2 కిలోల ప్లాస్టిక్‌ ఇచ్చిన వారికి అర డజన్‌ గుడ్లు ఉచితంగా ఇస్తున్నారు. […]

ప్లాస్టిక్‌ కొట్టు..కోడిగుడ్లు పట్టు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 06, 2019 | 6:01 PM

ప్లాస్టిక్‌ కొట్టు…కోడిగుడ్లు పట్టు ఇదేదో టెలివిజన్‌ షోనో, లేక సినిమా యాడ్‌ అనుకుంటున్నారా..? అయితే, మీరు పప్పులో కాలేసినట్టే. కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్‌ మహమ్మారిపై యుద్ధానికి సిద్ధమయ్యారు జిల్లా కలెక్టర్‌. జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్న అధికారులు ఆ దిశగా వినూత్న కార్యక్రామానకి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ప్లాస్టిక్‌కును సేకరించి తెచ్చిన వారికి బదులుగా కోడిగుడ్లను అందజేస్తున్నారు. 2 కిలోల ప్లాస్టిక్‌ ఇచ్చిన వారికి అర డజన్‌ గుడ్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇలా ప్లాస్టిక్‌ సేకరించి తెచ్చిన వారికి కిరణ షాపుల ద్వారా గుడ్లను ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు, రెడ్‌క్రాస్‌ సభ్యులను బృందాలుగా ఏర్పాటు చేశారు. సిఎం 30 రోజుల ప్ర‌ణాళిక త‌ర్వాత ప్లాస్టిక్ నివార‌ణ పై సిరియ‌స్ గా పోక‌స్ చేసిన అధికారులు.. ప్లాస్టిక్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అందులో భాగంగా గుడ్లు ఇవ్వాలనే ప్రతిపాదన తెచ్చారు. మండల రెవెన్యూ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు ఈ పథకానికి పర్యవేక్షకులుగా వ్యవహరించ‌నున్నారు.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్యానర్లు సిద్ధం చేసి ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. ఇప్పుడు ఈ బంప‌ర్ ఆఫ‌ర్ అటు సోష‌ల్ మీడియాతో పాటు ఇటు ప్ర‌జ‌ల్లోను ట్రేండింగ్ గా మారింది…ఇలాంటి వినూత్న కార్య‌క్రమాల‌తో ప్ర‌జ‌ల్లో చైతన్యం పెరుగుతుందని సూచించారు జిల్లా కలెక్టర్‌. ఈ ఆఫర్‌ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. భలే మంచి ఆఫర్‌ అని నెటిజన్లు సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు.