దేశ రాజధానిలో వణికిస్తున్న చలిగాలులు.. మరో నాలుగు రోజులపాటు కోల్డ్ వేవ్ ప్రభావం ఉంటుందన్న ఐఎండీ

దేశవ్యాప్తంగా గాలుల తీవ్రత పెరుగుతుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. అటు దేశ రాజధానిని కరోనాతో పాటు చలి వణికిస్తోంది.

దేశ రాజధానిలో వణికిస్తున్న చలిగాలులు.. మరో నాలుగు రోజులపాటు కోల్డ్ వేవ్ ప్రభావం ఉంటుందన్న ఐఎండీ
Follow us

|

Updated on: Dec 22, 2020 | 10:27 PM

దేశవ్యాప్తంగా గాలుల తీవ్రత పెరుగుతుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. అటు దేశ రాజధానిని కరోనాతో పాటు చలి వణికిస్తోంది. ఈశాన్య ప్రాంతం నుంచి వీస్తున్న చలిగాలులతో ఉత్తర భారత వణికిపోతుంది. ఇందులో భాగంగా రాబోయే నాలుగు రోజుల్లో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ ప్రభావం చలీ తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కనీస ఉష్ణోగ్రత మూడు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుందని ఐఎండీ మంగళవారం తెలిపింది.ఈ కాలంలో మితమైన దట్టమైన పొగమంచు కూడా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌గా సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ నమోదైంది. మైదనాలు, కొండ ప్రాంతాల్లో అధికంగా మంచు కురుస్తున్న కారణంగా..ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.