బెంగాల్ లో దీదీ, గవర్నర్ మధ్య కోల్డ్ వార్.. లాక్ డౌన్ అమలు తీరుపై ధన్ కర్ అసంతృప్తి

పశ్చిమబెంగాల్ లో సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి, గవర్నర్ జగదీప్ ధన్ కర్ కి మధ్య మళ్ళీ కోల్డ్ వార్ ప్రారంభమైంది. గత ఏడాది జులైలో ధన్ కర్ ఈ రాష్ట్ర గవర్నర్ గా వఛ్చినప్పటినుంచే ఆయనకు, దీదీ ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి.

బెంగాల్ లో దీదీ, గవర్నర్ మధ్య కోల్డ్ వార్.. లాక్ డౌన్ అమలు తీరుపై ధన్ కర్ అసంతృప్తి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 15, 2020 | 6:32 PM

పశ్చిమబెంగాల్ లో సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి, గవర్నర్ జగదీప్ ధన్ కర్ కి మధ్య మళ్ళీ కోల్డ్ వార్ ప్రారంభమైంది. గత ఏడాది జులైలో ధన్ కర్ ఈ రాష్ట్ర గవర్నర్ గా వఛ్చినప్పటినుంచే ఆయనకు, దీదీ ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో పోలీసులు, అధికారులు ప్రోటోకాల్ ను పాటించడంలేదని, వారిని తొలగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారు. వారి స్థానే సెంట్రల్ పారామిలిటరీ సిబ్బందిని నియమించాలన్నారు. కరోనాను తరిమి కొట్టేందుకు లాక్ డౌన్ ప్రోటోకాల్ ను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉందని, కానీ పోలీసులు, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మతపరమైన కార్యక్రమాల్లో జన సమూహాలను నియంత్రించలేకపోతున్నారని.. అందువల్ల వారిని తొలగించాలని ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర హోమ్ శాఖ కూడా ఈ  రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ .. మమతా బెనర్జీకి లేఖ రాసింది. ప్రభుత్వం ఈ ఆంక్షలను నీరు గారుస్తోందని ఆరోపించింది. అయితే దీదీ మాత్రం తామేమీ మతపరమైన ‘వైరస్’ తో పోట్లాడడంలేదని, మానవ కాంటాక్ట్ ద్వారా సోకే వైరస్ తోనే ఫైట్ చేస్తున్నామని అంటున్నారు. ఎక్కడైనా సమస్య వస్తే,, అక్కడ విధిగా లాక్ డౌన్ అమలయ్యేలా చూస్తన్నామని, అంతమాత్రాన షాపులు మూసివేయాలన్న అర్థం కాదని మండిపడ్డారు. పరోక్షంగా షాపులు తెరిచే ఉంచుతామని హింట్ ఇఛ్చారు. అటు రాష్ట్ర బీజేపీ శాఖ కూడా మమత ప్రభుత్వ తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కానీ మమత మాత్రం తాను అనుకున్నదే చేస్తున్నారు. ఇటీవలే రాష్ట్రంలో పాన్, స్వీట్, ఫ్లవర్ మార్కెట్లను తెరిచే ఉంచాలని ఆమె ఆదేశించారు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?