Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

బీజేపీలో… తెలుగు నేతల మధ్య కోల్డ్ వార్?

Cold War Between Telugu BJP Leaders, బీజేపీలో… తెలుగు నేతల మధ్య కోల్డ్ వార్?

బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి – టీజీ వెంకటేశ్ కు పొసగడం లేదనే విషయం ఇప్పుడు ఏపీ బీజేపీ వర్గాల్లో ట్రెండ్ అవుతోంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ నేతలిద్దరూ తలోదారిలో నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి – టీజీ వెంకటేశ్ తోపాటు సీఎం రమేశ్ – గరికపాటి మోహన్ రావు ఆపార్టీకి రాజీనామా చేసి – బీజేపీలో చేరారు. వీరిలో టీజే వెంకటేశ్ కి సుజనా చౌదరికి నడుమ మంచి స్నేహం ఉంది. ఆ స్నేహమే అయిష్టం అయినా వెంకటేశ్‌ను గోడదూకేసేలా చేసింది.

పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం తమపై వేటు వేయకుండా ఉండాలంటే జంప్ చేయడానికి సుజనాకు టీజీ వెంకటేశ్ మద్దతు తప్పలేదు. దీంతో ఆయన బలవంతంగా తన మిత్రుడితో కూడా బీజేపీకి జై కొట్టిం చేశారు. ఈ విషయాన్ని వెంకటేశ్ సైతం బాహాటంగానే అంగీకరించారు కూడా. ఇంత సఖ్యతగా ఉన్న ఆ ఇద్దరి నేతల మధ్య స్నేహం ప్రస్తుతం చెడినట్లే కనిపిస్తోంది. ఏపీ రాజధాని అంశంపై నేతలిద్దరూ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం గమనార్హం. బీజేపీ నుంచి రెండు గొంతులు వినిపిస్తుండటం చర్చనీయాంశం గా మారింది.

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండి తీరాలని సుజనా చౌదరి డిమాండ్ చేస్తుండగా – వెంకటేష్ మాత్రం రాయలసీమను రాజధాని చేయాలని కోరుతున్నారు. చంద్రబాబు తాత్కాలిక రాజధాని కట్టారంటే అసలు రాజధాని లేనట్టేగా అంటున్నారు టీజీ వెంకటేశ్. అంతే కాదు రాజధాని మార్చే ఉద్దేశ్యం లేకపోతే కనీసం రెండో రాజధాని చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. టీజీ అంశం బీజేపీలో చర్చనీయాంశం అవుతోంది.

మరోవైపు… మురళీధర్‌ రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. రాంమాధవ్‌, అదే బీజేపీలో మరో జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇద్దరూ తెలుగు నాయకులు, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వారు. అయితే ఇప్పడు ఈ ఇద్దరి మధ్యే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కోల్డ్‌ వార్‌ సాగుతోందన్న చర్చ సాగుతోంది. తెలంగాణకు చెందిన మురళీధర్ రావుకు, జాతీయస్థాయిలో మంచి పరిచయాలున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని నాయకుడిగా చలామణి అయ్యారు. నేషనల్‌ లెవల్‌లో పలు కీలక బాధ్యతలను పార్టీ ఆయనకు అప్పగించింది. అంతేకాదు, మొన్నటి వరకు తెలంగాణలోనూ ఆయన ఆధ్వర్యంలో కొన్ని చేరికలు జరిగాయి. అయితే ఇప్పుడు తగ్గాయి.

అయితే, ఏపీతో పాటు తెలంగాణ కమలంలోనూ ఏపీకి చెందిన రాంమాధవ్‌ జోక్యం పెరిగిందని మురళీధర్ రావు వర్గీయులు అసహనంతో రగిలిపోతున్నారట. డీకే అరుణతో పాటు చాలామంది కీలక నేతలను, బీజేపీలో చేర్పించింది రాంమాధవే. ఇంకా పార్టీలో చేరాలనుకుంటున్న చాలామంది ఇతర పార్టీల నాయకులు, రాంమాధవ్‌ ద్వారా అమిత్‌ షా సమక్షంలో పార్టీలో చేరతామని పట్టుబడుతున్నారట. ఈ పరిణామాలు సహజంగానే మురళీధర్‌ రావు వర్గీయుల అసంతృప్తికి కారణమయ్యాయని అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ రాంమాధవ్‌ ఆధిపత్యంపై, మురళీధర్ రావు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలు కూడా రాంమాధవ్‌కు ఇచ్చిన ఇంపార్టెన్స్‌ను తనకివ్వడంలేదని మురళీధర్‌ రావు వర్గీయులు రగిలిపోతున్నారట.